Kriti Shetty : హీరోకు వార్నింగ్ ఇచ్చిన బేబమ్మ.. ఎన్ని కోట్లిచ్చినా ఆ పని చేయను

- Advertisement -

Kriti Shetty : ‘ఉప్పెన’తో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి భారీ విజయాన్ని అందుకుంది కృతిశెట్టి . ఆ తర్వాత వరసగా సినిమాలు చేసి విజయాలను అందుకుంది. ఈ ఏడాది మాత్రం అమ్మడికి పరాజయాలే పలకరించాయి. తాజాగా ఆమె మలయాళ చిత్రసీమలోకి కూడా అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. బంగార్రాజు, శ్యాంసింగరాయ్ చిత్రాలతో పర్వాలేదనిపించినా ఆ తర్వాత వచ్చిన కస్టడీ , మాచర్ల నియోజకవర్గం, వారియర్‌ వంటి చిత్రాలు పెద్దగా మెప్పించలేదు. దీంతో ఆమె తమిళ్‌, కన్నడ చిత్రాలపై ఆసక్తి చూపింది. అక్కడ పలు అవకాశాలు దక్కించుకుని దూసుకుపోతుంది.

kriti-shetty

ఈ చిన్నది మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఉప్పెన సినిమా తర్వాత కృతికి వరుసగా ఆఫర్స్ వచ్చాయి. స్టార్ హీరోల సరసన ఛాన్స్‌లు రావడంతో ఈ అమ్మడు టాలీవుడ్‌లో నెంబర్ వన్ హీరోయిన్‌‌గా మారడం ఖాయం అనుకున్నారు అంతా.. కానీ ఊహించని విధంగా కృతి నటించిన సినిమాలన్నీ ఈ మధ్య డిజాస్టర్‌గా మిగిలిపోవడంతో బ్యూటీకి ఆఫర్స్ రావడం కూడా తగ్గిపోయినట్లు తెలుస్తోంది. కాగా, తాజాగా ఈ నటికి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

- Advertisement -

అది ఏమిటంటే?.. అయితే ఇటీవల ఈ అమ్మడు ఓ హీరోకు వార్నింగ్ ఇచ్చిందట. ఓ తెలుగు హీరో తన సినిమాలో ఐటమ్ సాంగ్ చేయమని రిక్వెస్ట్ చేశాడంట. అంతే కాకుండా ఆమెకు ఏకంగా రెండు కోట్ల చెక్ కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. కానీ కృతి మాత్రం నేను ఎన్ని కోట్లు ఇచ్చినా ఐటమ్ సాంగ్స్ చేయను. నాకు అమౌంట్ కూడా వద్దు అని తెగేసి చెప్పిదంట. కాగా, ఇందులో నిజం ఎంత ఉందో తెలియదు. కానీ ప్రస్తుతం ఈ న్యూస్ ఇండస్ట్రీలో తెగ వైరల్ అవుతోంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here