Mahesh Babu : సంక్రాంతి పండుగ వచ్చింది అంటే కచ్చితంగా రెండు మూడు సినిమాలు పోటీ పాడడం సర్వసాధారణం. కేవలం ఒక్క రోజు గ్యాప్ తో వచ్చే సినిమాలను మనం ఎక్కువగా ఈ సీజన్ లోనే చూస్తూ ఉంటాము. ఎన్ని సినిమాలు విడుదలైన టాక్ వచ్చే సినిమాలు బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకొని సూపర్ హిట్స్ గా నిలుస్తాయి. ఇక ఈ సంక్రాంతికి ‘గుంటూరు కారం’ చిత్రం తో పాటుగా ‘హనుమాన్’, ‘నా సామి రంగ’, ‘ఈగల్’ మరియు ‘సైంధవ్’ వంటి చిత్రాలు విడుదల అవుతున్నాయి.
ఇన్ని సినిమాలు ఒక సంక్రాంతికి రావడం ఎక్కడా జరగలేదు. వీరిలో ఎవరో ఒకరు తప్పుకోవాల్సిందిగా చర్చలు జరిపినప్పటికీ కూడా ప్రయోజనం లేకుండా పోయింది. ఎవ్వరూ తగ్గడం లేదు. అయితే ఈ సంక్రాంతికి అత్యధిక బిజినెస్ ని జరుపుకున్న చిత్రం మహేష్ బాబు – త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘గుంటూరు కారం’. దాదాపుగా 150 కోట్ల రూపాయిల బిజినెస్ ఈ చిత్రానికి జరిగింది.
అందుకే ఆ చిత్రం నైజాం ప్రాంత డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు సంక్రాంతికి పోటీ నిల్చిన అందరిని చర్చకి పిలిచి ఎవరో ఒకరిని రేస్ నుండి తప్పించే ప్రయత్నం చేసాడు. కానీ ఎవ్వరూ కూడా వెనక్కి వెళ్లే సమస్యే లేదు అనే ధోరణితో వ్యవహరించారు. దీంతో దిల్ రాజు నైజం లో తనకి ఉన్న పట్టు ఎలాంటిదో మరోసారి చూపించాడు. హైదరాబాద్ లో కేవలం 5 సింగిల్ స్క్రీన్స్ మినహా, మిగిలిన అన్నీ సింగల్ స్క్రీన్స్ ని కూడా ‘గుంటూరు కారం’ చిత్రం కోసం బుక్ చేసేసాడు. ఇది దారుణం మోసం అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేసారు.
ఇక పోతే నేడు ‘సైంధవ్’ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో పాల్గొన్న వెంకటేష్ ని ఇదే విషయంపై ఒక మీడియా రిపోర్టర్ ప్రస్తావిస్తూ ‘సంక్రాంతికి థియేటర్స్ మొత్తం మీ చిన్నోడు (మహేష్ బాబు) లాగేసుకున్నాడు కదా, ఇక మీ పరిస్థితి ఏమిటి ?’ అని అడుగుతాడు. దీనికి వెంకటేష్ సమాధానం ఇస్తూ ‘తీసుకొని అమ్మా..ఏమి ప్రాబ్లెమ్ లేదు..ఉన్న థియేటర్స్ లో వస్తాం..మా సినిమా మీద నమ్మకం ఉంది, థియేటర్స్ వాళ్ళే మా దగ్గరకి త్వరలో వస్తారు’ అంటూ వెంకటేష్ ఇచ్చిన సమాధానం ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.