Mahesh Babu : నమ్రతతో ఖలేజా సీన్ రిపీట్ చేసిన మహేశ్… నీలో చిలిపి తనం ఇంకాపోలేదంటున్న ఫ్యాన్స్

- Advertisement -


Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆయన సినిమాల్లోనే కాదు బయట కూడా ఏది చేసినా నాటీగా చాలా నీట్ గా, క్లీన్ గా చేస్తాడు. వరుస విజయాలతో ఫుల్ జోష్ లో ఉన్న మహేష్ బాబు ఈ న్యూ ఇయర్ ని బాగా ఎంజాయ్ చేశాడు. నిజానికి అతను ప్రతిరోజూ ఎంజాయ్ చేస్తూనే ఉంటాడు. ఏడాదికి కనీసం నాలుగైదు సార్లు వెకేషన్ తీసుకుని ఫ్యామిలీతో ఫారిన్ టూర్ కి చెక్కేస్తాడు మహేశ్ బాబు. అవకాశం దొరికితే మాత్రం టూర్లకు వెళ్లకుండా మిస్సవ్వడు.

ఇటీవలే న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోవడానికి మహేష్ బాబు దుబాయ్ వెళ్లాడు. అక్కడ తన కుటుంబం, స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేశాడు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే మహేశ్ బాబు.. న్యూ ఇయర్ సందర్భంగా ఓ అరుదైన ఫోటో షేర్ చేశారు. నమ్రతను అతడు ప్రేమగా దగ్గరకు తీసుకుని ముద్దులు పెట్టుకుంటున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ప్రేమకు నిర్వచనం మీరే.. ఎల్లప్పుడూ మీరు ఇలాగే ఉండాలని చాలామంది ఆశీర్వదిస్తున్నారు. అయితే ఈ పిక్చర్ లో ఉండే సీన్ ఆయన నటించిన ఖలేజా సినిమాలోని సీన్ రీ క్రియేషన్ అంటూ ఫ్యాన్స్ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. ఖలేజా మూవీలో కూడా సేమ్ హీరోయిన్ అనుష్క బాధలో ఉన్నప్పుడు తనను దగ్గరకు తీసుకుని బుజ్జగిస్తుంటాడు. ఆ సీన్లో ఆమెను ముద్దు పెట్టుకోవడానికి ట్రై చేస్తాడు. సేమ్ ఇదే సీన్ ని మళ్లీ నమ్రతతో రీ క్రియేట్ చేశాడు మహేష్ బాబు. దీనికి సంబంధించిన ఫొటోస్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here