Saindhav : ‘సైంధవ్’ మూవీ మొట్టమొదటి రివ్యూ..సెకండ్ హాఫ్ వెంకీ మామ ఏడిపించేసాడుగా!

- Advertisement -

Saindhav : ఈ సంక్రాంతి కానుకగా విడుదల అవ్వబోతున్న సినిమాలలో ఆడియన్స్ ని అమితంగా ఆకర్షిస్తున్న చిత్రాలలో ఒకటి విక్టరీ వెంకటేష్ హీరో గా నటించిన ‘సైంధవ్’ అనే చిత్రం. విక్టరీ వెంకటేష్ 75 వ చిత్రం గా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ మరియు ట్రైలర్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా మొన్న విడుదల చేసిన ట్రైలర్ లోని యాక్షన్ సన్నివేశాలకు యూత్ మొత్తం ఫిదా అయిపోయారు.

వెంకటేష్ ని ఈ రేంజ్ యాంగ్రీ మోడ్ లో చూసి చాలా కాలం అయ్యిందని, కచ్చితంగా ఈ సినిమా ఆయన కెరీర్ లో ఒక ల్యాండ్ మార్క్ చిత్రం గా నిలిచిపోతుందని అర్థం అయ్యింది. ఇకపోతే ఈ సినిమాకి సంబంధించిన ఫైనల్ కాపీ ని రీసెంట్ గానే ప్రసాద్ ల్యాబ్స్ లో కొంతమంది ముఖ్యమైన వాళ్లకు స్పెషల్ షో వేసి చూపించారు. వాళ్ళ నుండి రెస్పాన్స్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం.

సినిమా ప్రారంభమే ఆసక్తికరమైన పాయింట్ తో మొదలు అవుతుందట, కానీ ఆ తర్వాత కాస్త ఫ్లాట్ న్యారేషన్ అనిపించినప్పటికీ, 45 నిమిషాల తర్వాత గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో సినిమా పరిగిస్తుందని, ముఖ్యంగా ప్రీ ఇంటర్వెల్ నుండి ఇంటర్వెల్ వరకు వచ్చే సన్నివేశం ఆడియన్స్ మైండ్ ని బ్లాస్ట్ అయ్యేలా చేస్తుందని అంటున్నారు. ఇక సెకండ్ హాఫ్ లో యాక్షన్ తో పాటుగా ఎమోషన్ ని కూడా అదే రేంజ్ లో పండించాడట వెంకటేష్.

- Advertisement -

ముఖ్యంగా తన కూతురుతో వచ్చే సన్నివేశాలన్నీ కూడా హృదయానికి హత్తుకుంటాయట. తన కూతురికి అవసరమైన 17 కోట్ల రూపాయిల విలువైన ఇంజక్షన్ ని విలన్స్ నుండి ఎలా రప్పించుకున్నాడు, తన కూతురుని ఎలా కాపుడుకున్నాడు వంటి అంశాలను చాలా ఆసక్తికరంగా చూపించాడట డైరెక్టర్ శైలేష్ కొలను. చూడాలి మరి ఆడియన్స్ ఈ చిత్రాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here