VarunLav : వైట్ కారులో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గ్రాండ్ ఎంట్రీ.. పోలా.. అదిరి పోలా !VarunLav : మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నిశ్చితార్థం నుంచి పెళ్లి వరకు రోజుకో కార్యక్రమాన్ని నిర్వహిస్తూ అందుకు సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో అప్ లోడ్ చేస్తుంది మెగా ఫ్యామిలీ. వరుణ్ తేజ్ పెళ్లి వేడుకలో ఫ్యామిలీ అంతా తెగ ఎంజాయ్ చేస్తోంది. మెహందీ, హల్దీ, సంగీత్ ఇలా పెళ్లి వరకు ఒక్కో కార్యక్రమాన్ని భారీగా డిజైన్ చేశారు. ఇక నిన్న మెగా ఫ్యామిలీతో పాటు అల్లు ఫ్యామిలీ కూడా వరుణ్ లావణ్య పెళ్లి వేడుకకు హాజరయ్యారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్-ఉపాసన, అల్లు అర్జున్-స్నేహారెడ్డి దంపతులు, సాయి ధరమ్ తేజ్, నితిన్, అల్లు శిరీష్, వైష్ణవ్ తేజ్ ఇలా అందరూ పెళ్లిలో కనిపించారు.

VarunLav
VarunLav

అక్టోబర్ 30న కాక్‌టెయిల్ ఫంక్షన్‌తో ప్రారంభమైన పార్టీ పెళ్లి వేడుక గ్రాండ్ గా కొనసాగుతుంది. పెళ్లికొడుకుగా రెడీ అయిన వరుణ్ తేజ్ పెళ్లి మండపంలోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చిన వీడియో ట్విట్టర్లో తెగ వైరల్ అవుతోంది. ఇటలీలోని టాస్కానీలోకి తెల్లటి కారులో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు. తెల్లటి వింటేజ్ మోడల్ కన్వర్టిబుల్ కారులో లావణ్యను పెళ్లాడేందుకు మండపంలోకి ప్రవేశించాడు. స్టార్ సెలబ్రిటీ డిజైనర్ మనీష్ మల్హోత్రా అతని కోసం ప్రత్యేకంగా వైట్ కలర్ షేర్వాణీని డిజైన్ చేశారు.

పెళ్లి మండపానికి చేరుకున్న వరుణ్ తేజ్ సరిగ్గా ముహూర్త సమయానికే లావణ మెడలో మూడు ముళ్లు వేశారు. కొణిదెల, అల్లు వారి కుటుంబాలు నూతన వధూవరులను ఆశీర్వదించారు. మరో రెండు రోజుల్లో హైదరాబాద్ చేరుకోనుంది ఈ జంట. అనంతరం నవంబర్ 5న గ్రాండ్ గా రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారు. ఈ వేడుకకు సినీ, రాజకీయ ప్రముఖులను ఆహ్వానించనున్నారు.