Upasana : ఏ పెళ్లి లో అయినా అతిథి మర్యాదలతో పాటుగా చిన్న చిన్న పొరపాట్లు జరగడం చాలా కామన్. తెల్సీయినా వాళ్ళు ఎదురు పడినప్పుడు ఎలా ఉన్నావు అని అడగడం కంటే ముందుగా ఏమి చేస్తున్నావ్ అని కొంతమంది అడుగుతారు. పెళ్ళైన జంటకి పిల్లలు పుట్టకపోతే ఇంకా ఎందుకు పుట్టలేదు లాంటి ప్రశ్నలు అడుగుతూ ఉంటారు మరి కొంతమంది.

అలా ఉపాసన మరియు రామ్ చరణ్ కి కూడా ఈ రీసెంట్ గా వరుణ్ తేజ్ మరియు లావణ్య త్రిపాఠి పెళ్ళిలో ఇలాంటి ప్రశ్నలు ఎదురు అయ్యాయి అట. పెళ్ళైన పదేళ్ల తర్వాత రామ్ చరణ్ మరియు ఉపాసన కి క్లిన్ కారా అనే పాప జన్మించిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ పాప పుట్టిన తర్వాత సోషల్ మీడియా లో ఎన్నో సరదా కామెంట్స్ వినిపించాయి. క్లిన్ కారా పెరిగి పెద్దయిన తర్వాత అల్లు అర్జున్ కొడుకు అల్లు అయాన్ కి ఇచ్చి పెళ్లి చేసేయండి అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేశారు.

మొన్న జరిగిన వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి పెళ్లి కూడా వచ్చిన పెద్దలందరూ ఇదే ప్రశ్న అడుగుతూ ఉన్నారట. అల్లు అయాన్ క్లిన్ కారా ని ఎత్తుకొని ఆడిస్తున్న సమయం లో అక్కడికి వచ్చిన వారు, రేపు వాడికే కదా ఇచ్చి పెళ్లి చేసేది అంటూ అడిగారట. ఈ మాటలకు ఉపాసన చాలా ఫీల్ అయ్యినట్టు సమాచారం. ఆమెకి ఇలా మాట్లాడడం మొదటి నుండి ఇష్టం ఉండదట.

కల్మషం లేని పసి మనసులకు ఇప్పటి నుండే ఎందుకు ఇలాంటి లింక్స్ పెడుతారు, పిల్లల్ని పిల్లలు లాగ చూడలేరా అని ఉపాసన అంటూ ఉండేదట. ఈ పెళ్ళికి వచ్చిన ప్రతీ ఒక్కరు ఇవే ప్రశ్నలు అడుగుతూ ఉండేలోపు ఉపాసన బాగా డల్ అయిపోయిందట. పెళ్లి జరిగిన తర్వాత ఆమె మళ్ళీ కుటుంబం తో కలిసి కాకుండా చాలా సేపటి వరకు ప్రైవేట్ గా సమయం గడిపింది అట. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.
