Bigg Boss Telugu లో తన రెమ్యునరేషన్ చెప్పేసిన ధన్ రాజ్.. వామ్మో అన్ని లక్షలిచ్చారా!

- Advertisement -

Bigg Boss Telugu : జూనియర్ ఆర్టిస్ట్ గా కెరియర్ స్టార్ట్ చేసిన ధన్ రాజ్ ‘జబర్దస్త్’ కామెడీ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘జబర్దస్త్’ షోలో ధనాధన్ ధన్ రాజ్ గా తనదైన కామెడీతో బుల్లితెర ఆడియన్స్ ని ఆకట్టుకున్నాడు. ధన్ రాజ్ ‘బిగ్ బాస్’ సీజన్-1 లో పాల్గొని దాదాపు 40 రోజులపాటు హౌజ్ లో ఉండి టాప్ టెన్ ప్లేస్ లో చోటు సంపాదించాడు. ఆ తర్వాత బుల్లితెరపై అదిరింది షోలో కనిపించాడు. హీరోగా, నిర్మాతగా కూడా కొన్ని సినిమాలు చేశాడు. కానీ అవేవీ ధన్ రాజ్ కి గుర్తింపును తేలేకపోయాయి. ఇక రీసెంట్ మళ్లీ మెగా ఫోన్ పట్టి దర్శకుడిగా బిజీ అయ్యాడు.

Bigg Boss Telugu
Bigg Boss Telugu

ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ధన్ రాజ్ తను ‘బిగ్ బాస్’ షో లో వెళ్లడం గురించి తనకిచ్చిన రెమ్యునరేషన్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ‘బిగ్ బాస్’ లోకి వెళ్లడానికి రీజన్ ఏంటని? యాంకర్ అడగగా దానికి ధనరాజ్ బదులిస్తూ.. “నేను టీవీ షోస్ చేస్తున్న సమయంలోనే ‘బిగ్ బాస్’ గురించి తెలిసింది. కానీ, పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు. కానీ తర్వాత ఈ షోకి ఎన్టీఆర్ గారు హోస్ట్ చేస్తున్నారు అని తెలియగానే నేను కూడా ‘బిగ్ బాస్’కి ఓకే చెప్పాను. ఆ తర్వాత నవదీప్ కూడా ‘బిగ్ బాస్’కి వెళ్తున్నారనే విషయం తెలిసింది. ‘జై’ మూవీ నుంచి మాకు మంచి ఫ్రెండ్షిప్ ఉంది. అప్పుడు మనం ‘బిగ్ బాస్’కి వెళ్లాక ఉండకపోతే ఏంటి? అని నవదీప్‌ను అడిగితే, ‘బిగ్ బాస్’లో నేను ఉండను, వెళ్ళిపోతా అని చెప్తే పంపించేస్తారు అని అన్నాడు.

నవదీప్ నాతో పాటే హౌస్‌కి వస్తాడనుకున్నా. కానీ వైల్డ్ కార్డులో వస్తాడని నాకు తెలియదు” అని అన్నాడు. మీరు ‘బిగ్ బాస్’కి వెళ్ళినప్పుడు ఎంత ఆఫర్ ఇచ్చారు? అని యాంకర్ అడగగా.. “నేను ఒక వారానికి 7 లక్షల 50వేలు తీసుకున్నాను. బేసిగ్గా దీని గురించి చాలా మంది చెప్పరు. కానీ నేను తీసుకున్నాను కాబట్టి ఆ విషయం చెప్పడంలో తప్పులేదు. రెమ్యునరేషన్ కూడా ఫర్ డే కాకుండా వీక్లీ వైజ్ గా మాట్లాడుకుంటారు. ఎందుకంటే ఏ వీక్ వచ్చేస్తామో తెలియదు కదా. అందుకే వీక్లీ రెమ్యునరేషన్ లాగా ఇస్తారు” అని చెప్పుకొచ్చాడు ధన్ రాజ్.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here