మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మరియు లావణ్య త్రిపాఠి గత కొంత కాలం నుండి సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో ట్రెండ్ అవుతున్న జంట. ఇన్ని రోజులు వీళ్లిద్దరు మేము ప్రేమించుకుంటున్నాం, పెళ్లి చేసుకోబోతున్నాము అని ఎక్కడా చెప్పకపోయినా, వీళ్ళ గురించి సోషల్ మీడియా లో ఎదో ఒక న్యూస్ వస్తూనే ఉండేది. ఈమధ్య కాలం లో సోషల్ మీడియా మొత్తం ఫేక్ న్యూస్ రూమర్స్ ఉంటున్నాయి కదా, ఇది కూడా అంతే అయ్యుంటుంది అని అనుకున్నారు అందరూ.

కానీ వీళ్లిద్దరు నిజంగానే పెళ్లి చేసుకుంటున్నట్టు రెండు రోజుల క్రితమే అధికారికంగా తెలిసింది. నేడు వీళ్లిద్దరి నిశ్చితార్ధ వేడుక హైదరాబాద్ లోని నాగబాబు నివాసం లో బంధు మిత్రుల సమక్ష్యం లో ఘనంగా జరిగింది. ఈ నిశ్చితార్ధ వేడుకకు మీడియా కి ఎలాంటి ఆహ్వానం దక్కలేదు. గేట్ బయటే నిల్చొని వచ్చి పొయ్యే కార్లకు వీడియోస్ తీసుకున్నారు.

ఈ జంట నిశ్చితార్థం కి సంబంధించిన ఫోటోలు కాసేపటి క్రితమే సోషల్ మీడియా లో లీక్ అయ్యాయి. ఈ వేడుకకు మెగా ఫ్యామిలీ మొత్తం హాజరైంది.చిరంజీవి ,రామ్ చరణ్ మరియు అల్లు అర్జున్ తమ సతీమణులతో కలిసి ఈ వేడుకకు హాజరయ్యారు. ఇక #OG మూవీ షూటింగ్ లో బిజీ ఉన్న పవన్ కళ్యాణ్ ఈ నిశ్చితార్ధ వేడుకకు వస్తాడో లేదో అనే అనుమానం ఉండేది.

కానీ షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఆయన నేరుగా నాగబాబు ఇంటికి చేరుకున్నారు. ఇదే రోజు VV లక్ష్మీ నారాయణ కూతురు నిశ్చితార్థం కూడా ఉంది, ఈ నిశ్చితార్ధ వేడుకకు కూడా పవన్ కళ్యాణ్ హాజరయ్యాడు. ఇక వరుణ్ తేజ్ మరియు లావణ్య త్రిపాఠి పెళ్లి చేసుకోబోతుండడం తో మెగా అభిమానులు ఎంతో ఆనందం ని వ్యక్తపరుస్తున్నారు. ఈ వివాహ మహోత్సవం ఎంత గ్రాండ్ గా జరగబోతుందో చూడాలి.
Found my Lav!♥️@Itslavanya pic.twitter.com/OCyhWcIjMq
— Varun Tej Konidela (@IAmVarunTej) June 9, 2023