ప్రభుదేవా వల్ల ఇబ్బంది పడిన రాజశేఖర్.. చివరికి అంత మాట అన్నాడుటతెలుగు సినిమా ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి వారిలో సీనియర్ హీరో రాజశేఖర్ ఒకరు.ఈయన సినిమాలపై ఉన్న మక్కువతో తన డాక్టర్ వృత్తిని కూడా పక్కనపెట్టి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు.1984 లో మొదలైన ఆయన సినీ ప్రస్థానం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ‘యాంగ్రీ యంగ్‌మెన్‌’గా తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.

రాజశేఖర్
రాజశేఖర్

అయితే రాజశేఖర్ ను ఒక విషయంలో డ్యాన్స్ మాస్టార్ ప్రభుదేవ వల్ల విపరీతమైన ఇబ్బంది పడ్డాడుట. ఆయన నటించిన ‘అల్లరిప్రియుడు’ మ్యూజికల్‌గా ఎంత పెద్ద హిట్టో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే, అందులోని పాటలకు డ్యాన్స్‌ చేయడానికి రాజశేఖర్‌ చాలా ఇబ్బంది పడేవారట. ‘‘ప్రభుదేవా చేసి చూపించిన స్టెప్‌లు వేయలేకపోయేవాడిని. దీంతో నా బాడీకి సరిపోయేలా స్టెప్‌లను ప్రభుదేవా చేసి చూపించేవారు. కొన్ని సార్లు అవికూడా చేయలేకపోయేవాడిని. అయినా, ప్రభుదేవా ఎప్పుడూ అసహనం వ్యక్తం చేయలేదు. తన సహాయకులకు, సైడ్‌ డ్యాన్సర్లకు ఒక సలహా ఇచ్చారు. ‘ఆయన(రాజశేఖర్‌) ఏది చేస్తే దాన్ని ఫాలో అవ్వండి’ అని చెప్పారట. నన్ను ‘డాక్టర్‌ మైకేల్‌ జాక్సన్‌’ అని సరదాగా పిలిచేవారు’’ అంటూ సరదాగా చెప్పాడు రాజశేఖర్.

ప్రభుదేవా
ప్రభుదేవా

అప్పట్లో ‘అంకుశం’ వంటి చిత్రాలతో మాస్‌ ప్రేక్షకుల్లో మంచి ఫాలోయింగ్‌ను సొంతం చేసుకున్న రాజశేఖర్‌ ‘అల్లరి ప్రియుడు’లో ప్రేమికుడిగా నటించి, తాను ఏ పాత్రలోనైనా ఒదిగిపోతానని నిరూపించారు. రాఘవేంద్రరావు ఈ కథ చెప్పగానే రాజశేఖర్‌తో సహా చాలా మంది ‘ఎందుకు సర్‌ రిస్క్‌’ అన్నారట. అయినా, దర్శకేంద్రుడు పట్టు వదల్లేదు. ఆయనతో సినిమా తీసి హిట్‌ కొట్టారు.