Varalakshmi : ఆ స్టార్ హీరో వల్లే స్టార్ హీరోయిన్ అయ్యే ఛాన్స్ ను వదులుకున్న వరలక్ష్మి..!

- Advertisement -

వరలక్ష్మి శరత్ కుమార్.. ప్రముఖ సీనియర్ నటుడు శరత్ కుమార్ కుమార్తె అయిన వరలక్ష్మి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తెలుగు స్టార్ హీరోలకు లక్కీ విలన్ గా Varalakshmi Sarathkumar గుర్తింపు తెచ్చుకుంది.. ఈమె విలన్ గా ఏ సినిమాలో నటించినా సరే ఆ సినిమా పక్క బ్లాక్ బాస్టర్ అనడంలో సందేహం లేదు. ఇదివరకే గత ఏడాది వరుస ప్లాపులతో కొట్టుమిట్టాడుతున్న అటు రవితేజ, ఇటు అల్లరి నరేష్ ల సినిమాలలో విలన్ గా నటించి మరింత పాపులారిటీని దక్కించుకుంది. అయితే మొదట 2012లో పోడా పొడి అనే తమిళ సినిమా ద్వారా ఇండస్ట్రీకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.

హీరోయిన్ గా వరస సినిమాలలో అవకాశాలు వచ్చినా.. విలన్ పాత్రలు, సహాయక పాత్రలతోనే సెటిల్ అయింది. “తెనాలి రామకృష్ణ బిఎ, బిఎల్” అనే సినిమా ద్వారా విలన్ గా తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈమె ఆ తరువాత తెలుగు, తమిళ్, కన్నడ భాషలలో సుమారుగా 12కు పైగా చిత్రాలలో ఇప్పుడు నటిస్తూ ఉండడం గమనార్హం. లేడీ ఓరియంటెడ్ చిత్రాలకు సాయం చేయడమే కాకుండా ఇంకొక వైపు విలన్ గా యువతను బాగా ఆకట్టుకుంటుంది. అయితే ప్రస్తుతం విలన్ గా సత్తా చాటుతున్న వరలక్ష్మి శరత్ కుమార్ గతంలో స్టార్ హీరోయిన్ అవ్వాల్సి ఉండేది. కానీ ఒక స్టార్ హీరో వల్లే తన కెరీర్ మొత్తం స్పాయిల్ అయిందని చెప్పవచ్చు.

varalakshmi sarathkumar
varalakshmi sarathkumar

ఆ స్టార్ హీరో ఆమె జీవితంతో ఆడుకున్నాడు. నిజానికి ఆ స్టార్ హీరోకి వరలక్ష్మి సినిమాలోకి రావడం ఏమాత్రం ఇష్టం లేదట. దాంతో వచ్చిన అవకాశాలు అన్నింటిని కూడా ఆమె చేసేతులారా వదులుకుంది. 2003లో శంకర్ రూపొందించిన “బాయ్స్” చిత్రంలో అలాగే “ప్రేమిస్తే” సినిమాలో కూడా ఈమెకు హీరోయిన్గా అవకాశం వచ్చింది. కానీ ఆ స్టార్ హీరో వల్లే వరలక్ష్మి అవకాశాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆ స్టార్ హీరో వల్లే హీరోయిన్ అయ్యే అవకాశాన్ని వదులుకొని.. ప్రస్తుతం విలన్ గా సెటిల్ అయింది వరలక్ష్మి శరత్ కుమార్.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here