Varalakshmi Sarath Kumar : శరత్ కుమార్ కుమార్తెగా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన వరలక్ష్మీ శరత్ కుమార్.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. 2012లో అరంగేట్రం చేసిన ఈ టాలెంటెడ్ నటి తమిళం, కన్నడ, మలయాళం, తెలుగు సినిమాల్లో నటిస్తున్నారు. కొన్ని చిత్రాల్లో విలన్‍గా తన ముద్ర వేశారు. క్రాక్ సినిమాలో విలన్‍గా జయమ్మ పాత్రతో తెలుగులో ఫేమస్ అయ్యారు వరలక్ష్మి. ఇటీవల హనుమాన్ చిత్రంలో హీరో అక్క పాత్రలో మెప్పించారు.
![](https://cdn.telugucinematoday.com/wp-content/uploads/2024/03/varalakshmi1-jpg.webp)
కాగా, ఇప్పుడు పెళ్లి పీటలు ఎక్కేందుకు వరలక్ష్మీ శరత్ కుమార్ సిద్దమయ్యారు. ఆమె నిశ్చితార్థం ముంబైలో జరిగింది. గ్యాలరిస్ట్ నికోలై సచ్‍దేవ్‍తో వరలక్ష్మీ శరత్ కుమార్ నిశ్చితార్థం జరిగింది. ముంబైలో ఇరు కుటుంబాలు, సన్నిహితుల మధ్య ఈ వేడుక శుక్రవారం సాగింది. ఈ విషయం నేడు బయటికి వచ్చింది. ముంబైకు చెందిన వ్యాపారవేత్త నికోలై సచ్‍దేవ్.. ఆర్ట్ గ్యాలరీను నిర్వహిస్తుంటారు. వరలక్ష్మి, సచ్‍దేవ్ నిశ్చితార్థానికి సంబంధించిన ఫొటోలు బయటికి వచ్చాయి.
![](https://cdn.telugucinematoday.com/wp-content/uploads/2024/03/varalakshmi2-jpg.webp)
“ముంబైలో మార్చి 1న జరిగిన వేడుకలో కుటుంబాలు, సన్నిహితుల సమక్షంలో నటి వరలక్ష్మి శరత్ కుమార్, గ్యాలరిస్ట్ నికోలై సచ్‍దేవ్ ఎంగేజ్‍మెంట్ జరిగింది. గత 14 ఏళ్లుగా ఒకరితో ఒకరికి పరిచయం ఉన్న వరలక్ష్మి, శరత్ రింగులు మార్చుకున్నారు” అని ఓ లెటర్ వెల్లడైంది. ఈ ఏడాదిలోనే ఇద్దరూ పెళ్లి చేసుకోనున్నారని తెలుస్తోంది. 38 ఏళ్ల వయసులో వరలక్ష్మీ శరత్ కుమార్ ఎట్టకేలకు ఎంగేజ్‍మెంట్ చేసుకున్నారు. త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్నారు. 14 ఏళ్లుగా తనకు పరిచయం ఉన్న గ్యాలరిస్టు నికోలై సచ్‍దేవ్‍ను వివాహం చేసుకోనున్నారు.