Varalakshmi Sarath Kumar : 14 ఏళ్లుగా ప్రేమ.. 38 ఏళ్ల వయసులో వరలక్ష్మి శరత్ కుమార్ ఎంగేజ్మెంట్.. వరుడు ఎవరంటే..!

- Advertisement -

Varalakshmi Sarath Kumar : శరత్ కుమార్ కుమార్తెగా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన వరలక్ష్మీ శరత్ కుమార్.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. 2012లో అరంగేట్రం చేసిన ఈ టాలెంటెడ్ నటి తమిళం, కన్నడ, మలయాళం, తెలుగు సినిమాల్లో నటిస్తున్నారు. కొన్ని చిత్రాల్లో విలన్‍గా తన ముద్ర వేశారు. క్రాక్ సినిమాలో విలన్‍గా జయమ్మ పాత్రతో తెలుగులో ఫేమస్ అయ్యారు వరలక్ష్మి. ఇటీవల హనుమాన్ చిత్రంలో హీరో అక్క పాత్రలో మెప్పించారు.

కాగా, ఇప్పుడు పెళ్లి పీటలు ఎక్కేందుకు వరలక్ష్మీ శరత్ కుమార్ సిద్దమయ్యారు. ఆమె నిశ్చితార్థం ముంబైలో జరిగింది. గ్యాలరిస్ట్ నికోలై సచ్‍దేవ్‍తో వరలక్ష్మీ శరత్ కుమార్ నిశ్చితార్థం జరిగింది. ముంబైలో ఇరు కుటుంబాలు, సన్నిహితుల మధ్య ఈ వేడుక శుక్రవారం సాగింది. ఈ విషయం నేడు బయటికి వచ్చింది. ముంబైకు చెందిన వ్యాపారవేత్త నికోలై సచ్‍దేవ్.. ఆర్ట్ గ్యాలరీను నిర్వహిస్తుంటారు. వరలక్ష్మి, సచ్‍దేవ్ నిశ్చితార్థానికి సంబంధించిన ఫొటోలు బయటికి వచ్చాయి.

“ముంబైలో మార్చి 1న జరిగిన వేడుకలో కుటుంబాలు, సన్నిహితుల సమక్షంలో నటి వరలక్ష్మి శరత్ కుమార్, గ్యాలరిస్ట్ నికోలై సచ్‍దేవ్ ఎంగేజ్‍మెంట్ జరిగింది. గత 14 ఏళ్లుగా ఒకరితో ఒకరికి పరిచయం ఉన్న వరలక్ష్మి, శరత్ రింగులు మార్చుకున్నారు” అని ఓ లెటర్ వెల్లడైంది. ఈ ఏడాదిలోనే ఇద్దరూ పెళ్లి చేసుకోనున్నారని తెలుస్తోంది. 38 ఏళ్ల వయసులో వరలక్ష్మీ శరత్ కుమార్ ఎట్టకేలకు ఎంగేజ్‍మెంట్ చేసుకున్నారు. త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్నారు. 14 ఏళ్లుగా తనకు పరిచయం ఉన్న గ్యాలరిస్టు నికోలై సచ్‍దేవ్‍ను వివాహం చేసుకోనున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here