Venu Sriram : లెంట్ లేక సరైన సినిమాలు తియ్యడం చేతకాక ఫేడ్ అవుట్ అయిపోయిన డైరెక్టర్స్ టాలీవుడ్ లో చాలా మంది ఉన్నారు.. కానీ తీసిన సినిమాలలో 90 సక్సెస్ రేషియో ఉన్నప్పటికీ కూడా అవకాశాలు లేక ఇంట్లో ఖాళీగా కూర్చుకున్న దర్శకులు చాలా తక్కువ మంది మాత్రమే ఉన్నారు, వారిలో ఒకరే వేణు శ్రీరామ్. 2011 వ సంవత్సరం లో సిద్దార్థ్ మరియు శృతి హాసన్ కాంబినేషన్ లో ‘ఓ మై ఫ్రెండ్’ అనే సినిమా తీసాడు.
దిల్ రాజు ప్రొడక్షన్ హౌస్ నుండి వచ్చిన ఈ సినిమా యావరేజి గా నిల్చింది.ఆ తర్వాత న్యాచురల్ స్టార్ నాని హీరో గా నటించినా MCA – మిడిల్ క్లాస్ అబ్బాయి సినిమాకి దర్శకత్వం వచించాడు.ఈ సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే.ఆ తర్వాత ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ‘వకీల్ సాబ్’ సినిమా చేసాడు.
వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ లో ఉన్న పవన్ కళ్యాణ్ కి ఈ సినిమా పెద్ద హిట్ గా నిల్చింది..ఫ్యామిలీ ఆడియన్స్ లో పవర్ స్టార్ రేంజ్ ని పెంచిన ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మనస్సులో కూడా ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు వేణు శ్రీరామ్. కరోనా సెకండ్ వేవ్ విలయతాండవం ఆడుతున్న సమయం లో విడుదలైన ఈ సినిమాని లాక్ డౌన్ కారణంగా థియేటర్స్ నుండి తీసి వెయ్యాల్సి వచ్చింది.
కానీ, లేకపోతే టాలీవుడ్ ఇండస్ట్రీ లో రికార్డ్స్ అన్నిటిని బద్దలు కొట్టేది ఈ సినిమా.అంత మంచి సినిమా తీసిన తర్వాత కూడా వేణు శ్రీరామ్ కి టాలీవుడ్ లో అవకాశాలు రాకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది.కొన్నేళ్ల క్రితం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో ‘ఐకాన్ – కనుబడుటలేదు’ అనే చిత్రాన్ని ప్రకటించాడు..కానీ అల్లు అర్జున్ ఇప్పుడు వరుసగా పాన్ ఇండియన్ మూవీస్ తో బిజీ అవ్వడం వల్ల ఈ సినిమా అట్టకెక్కింది.
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మాత్రమే కాదు , మిగిలిన స్టార్ హీరోలు కూడా వేణు శ్రీరామ్ ని పట్టించుకోవడం లేదు, పింక్ లాంటి ఆఫ్ బీట్ సినిమాని రీమేక్ చేసి కమర్షియల్ ఫార్మటు లో మార్చి పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ తో సినిమా తీసి హిట్ కొట్టడం అంటే మాటలు కాదు..అలాంటి టాలెంట్ ఉన్న దర్శకుడిని ఎందుకు మన హీరోలు పట్టించుకోవడం లేదు అని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు..స్టార్ హీరోల సంగతి పక్కన పెడితే మీడియం రేంజ్ హీరోలు కూడా వేణు శ్రీ రామ్ ని పట్టించుకోవడం లేదు, చూస్తూ ఉండగానే ఒక టాలెంటెడ్ డైరెక్టర్ కనుమరుగు అయ్యిపోవాలా? అని వేణు శ్రీ రామ్ ని అభిమానించే వాళ్ళు వాపోతున్నారు.మరి ఈ టాలెంటెడ్ డైరెక్టర్ కి ఎవరు అవకాశం ఇస్తారో చూడాలి.