Amigos Movie : అమిగోస్ ఓటిటి పార్ట్నర్ లాక్.. ఎప్పుడొస్తుందంటే?

- Advertisement -

Amigos Movie : నందమూరి హీరో కళ్యాణ్ రామ్ వరుస హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్నాడు..తాజాగా విడుదలైన అమిగోస్ కూడా మంచి హిట్ టాక్ ను అందుకుంది.. రాజేంద్ర రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో అషికా రంగనాథ్ హీరోయిన్‌గా నటించింది. భారీ అంచనాల మధ్య ఈ శుక్రవారం విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభించింది. దీంతో ఈ చిత్రం త్వరలోనే ఓటీటీలోకి వచ్చేస్తుందనే ప్రచారం జరుగుతుంది. సినిమా విడుదలైన రోజే ఓటీటీ హక్కులు కొనుగోలు చేసిన సంస్థపై క్లారిటీ వచ్చేసింది.

Amigos Movie
Amigos Movie

గత ఏడాది “బింబిసార” తర్వాత కళ్యాణ్ రామ్ ఈ సినిమా తో మరొక ఛాలెంజింగ్ పాత్రను ఎంపిక చేసుకున్నారని చెప్పుకోవచ్చు. ఈ సినిమాలో విభిన్న లుక్కులతో త్రిపాత్రాభినయం చేసిన కళ్యాణ్ రామ్ తన నటనతో అందరి దృష్టిని ఆకర్షించారు. మూడు విభిన్న పాత్రలు అయినప్పటికీ వాటి మధ్య వేరియేషన్స్ ను కళ్యాణ్ రామ్ చాలా బాగా చూపించారు.

ఈ సినిమా కోసం కళ్యాణ్ రామ్ చాలా కష్టపడ్డారని తెలుస్తోంది. సినిమా ఆద్యంతం తన అద్భుతమైన పర్ఫామెన్స్ తో కళ్యాణ్ రామ్ కట్టిపడేస్తారు. అసికా రంగనాథ్ కూడా తన పాత్రలో చాలా బాగా నటించింది.ఈ సినిమాతో మంచి టాక్ ను అందుకున్న ఈ అమ్మడు తెలుగులో ఎలాంటి అవకాశాలను అందుకుంటుందో చూడాలి..

- Advertisement -

ఇకపోతే.. ఈ సినిమా డిజిటల్‌ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ దక్కించుకుంది. ప్రస్తుతానికి నిర్మాతలతో ఉన్న ఒప్పందం మేరకు 8 వారాల తర్వాత ఈ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేయాలి. కానీ సినిమాకు వచ్చిన స్పందనను బట్టి.. 8 వారాల కంటే ముందే ఓటీటీలో స్ట్రీమింగ్‌ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో కల్యాణ్‌ రామ్ ట్రిపుల్‌ రోల్‌ ప్లే చేశాడు. వాటిలో ఒక పాత్ర పూర్తిగా నెగిటివ్ షేడ్స్ తో కూడి ఉండగా మరొక రెండు పాత్రలు భిన్నమైన కోణాల్లో సాగుతాయి.. మొత్తానికి ఈ సినిమా మంచి టాక్ తో పాటు.. భారీ వసూళ్లను కూడా రాబట్టింది..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here