ఉస్తాద్ భగత్ సింగ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చేస్తున్న సినిమాలలో అభిమానులతో పాటుగా, ప్రేక్షకులు కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. గబ్బర్ సింగ్ లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత పవన్ కళ్యాణ్ మరియు హరీష్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా ఇది. అందుకే మార్కెట్ లో ఈ చిత్రం పై ఈ రేంజ్ క్రేజ్ ఏర్పడింది. అయితే ఈ సినిమాకి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ ఈమధ్యనే ప్రారంభమై ఒక షెడ్యూల్ ని పూర్తి చేసుకుంది.

సుమారుగా పది రోజుల పాటుగా సాగిన ఈ షెడ్యూల్ లో పవన్ కళ్యాణ్ పై కొన్ని అదిరిపొయ్యే యాక్షన్ బ్లాక్స్ ని తెరకెక్కించాడు డైరెక్టర్ హరీష్ శంకర్. ఈ షెడ్యూల్ కి సంబంధించిన ఎడిటింగ్ వర్క్ కూడా ఈమధ్యనే ప్రారంభం అయ్యింది, ఇది ఇలా ఉండగా ఈ సినిమాకి సంబంధించిన గ్లిమ్స్ / టీజర్ మే 11 వ తేదీన విడుదల చేయబోతున్నట్టు సమాచారం.

మే 11 వ తేదీన ‘గబ్బర్ సింగ్’ చిత్రం విడుదలై 11 ఏళ్ళు పూర్తి అవుతున్న సందర్భంగా హరీష్ శంకర్ ఇలా ప్లాన్ చేస్తున్నాడు. ఈ టీజర్ కి సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు సోషల్ మీడియా లో లీక్ అయ్యాయి. ఈ టీజర్ లో పవన్ కళ్యాణ్ రెండు విభిన్నమైన గెటప్స్ లో కనిపిస్తాడట. ముందుగా పోలీస్ స్టేషన్ కొన్ని మాస్ సన్నివేశాలకు సంబంధించిన షాట్స్ మరియు మస్జీద్ వద్ద జరిగే ఒక ఫైట్ సన్నివేశానికి సంబంధించిన షాట్స్ ని జత చేసి ఈ టీజర్ ని సిద్ధం చేసినట్టు తెలుస్తుంది.

పవన్ కళ్యాణ్ లోని ఊర మాస్ యాంగిల్ ని చూపిస్తూ, ఆయన నోటి నుండి వచ్చే డైలాగ్ తూటా లాగ ఉండబోతుంది అట. టీజర్ కట్ ఇప్పటికే సిద్ధం అయ్యిందని, ఇక దేవిశ్రీ ప్రసాద్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇవ్వడం ఒక్కటే బ్యాలన్స్ ఉందని ఈ సందర్భంగా తెలుస్తుంది. నేడు దేవిశ్రీ ప్రసాద్ ని హరీష్ శంకర్ కలిసి వీడియో ఒకటి కాసేపటి క్రితమే సోషల్ మీడియా లో విడుదల చేసారు.ఆ వీడియో ని మీరు కూడా క్రింద చూడవచ్చు.
THE MAGICAL MUSICAL COMBO IS BACK ❤️🔥
— Mythri Movie Makers (@MythriOfficial) April 30, 2023
Blockbuster Director @harish2you and Rockstar @ThisIsDSP are set to give another memorable album with #UstaadBhagatSingh 🎷
ROCKING updates rolling out soon 🥳@PawanKalyan @sreeleela14 @DoP_Bose #AnandSai @ChotaKPrasad @UBSTheFilm pic.twitter.com/9oOiw9bAw4