పవన్ కళ్యాణ్ ను అడ్డంగా ఇరికించిన రేణు దేశాయ్ .. సంచలంగా మారిన ‘ కమింగ్ సూన్’ వీడియో..

- Advertisement -

సినీ నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. విడాకులు తీసుకున్న పవన్ కళ్యాణ్ ను కలుస్తూ వస్తుంది.. మనస్పర్థలు వచ్చి విడిపోయిన కూడా పవన్ కళ్యాణ్ గురించి ఎప్పుడూ ఏదొక విషయం పై జనాలతో ముచ్చటిస్తూ.. పవన్ ఫ్యాన్స్ ఆగ్రహానికి గురవుతుంది.. ఇటీవల అకిరా పుట్టినరోజున పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, రేణు దేశాయ్ ల మధ్య సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఫైటింగ్ జరిగిన విషయం తెలిసిందే.. అది ఎంత రచ్చగా మారిందో చూసాము.. తాజాగా ఇప్పుడు మరోసారి పవన్ కళ్యాణ్ ను అడ్డంగా ఇరికించే ప్రయత్నం చేస్తుంది రేణు దేశాయ్.. అందుకు సంబందించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతుంది..

రేణు దేశాయ్
రేణు దేశాయ్

తాజాగా, పవన్ కల్యాణ్‌పై సంచలన వ్యాఖ్యలు చేస్తూ మరో వీడియో ను విడుదల చేసింది. జీవితం, సంబంధాలు, ఆరోగ్యం మరెన్నో విషయాల గురించి చాలా గంభీరంగా మాట్లాడుతున్నా.. ఈ ఎపిసోడ్‌లు మీలో కొందరికి సహాయపడతాయని ఆశిస్తున్నాను కమింగ్ సూన్ అంటూ ఆమె లేటెస్ట్‌గా చేసిన ఇంటర్వ్యూకి సంబంధించిన ఎడిటింగ్ వీడియోను పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ వీడియోను చూసిన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆమెను బండబూతులు తిడుతున్నట్లు తెలుస్తుంది.. ఎందుకు మా అన్నను ఇలా చేస్తున్నావు.. అసలు నీకేం కావాలి అని రకరకాల కామెంట్స్ చేస్తున్నట్లు సమాచారం..

Pawan Kalyan

ఇది ఇలా ఉండగా.. మరి కొద్ది రోజుల్లో ఆంధ్ర ప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికలు జరుగబోతున్నాయి, పవన్ కళ్యాణ్ ఇమేజి కి దెబ్బ తీసే విధమైన కామెంట్స్ చెయ్యడానికే ఆమె సరిగ్గా సమయం చూసుకొని ఎన్నికల సమయం లోనే ఇంటర్వ్యూస్ ప్లాన్ చేస్తుంది అంటూ కొంతమంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు. మరి రేణు దేశాయ్ ఈ ఇంటర్వ్యూస్ లో ఎలాంటి విషయాల గురించి మాట్లాడబోతుందో చూడాలి… ఏది ఏమైనా ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.. పవన్ కళ్యాణ్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం రెండు, మూడు ప్రాజెక్టు లలో నటిస్తున్నారు.. వచ్చే ఏడాదిలోగా విడుదల కాబోతున్నాయి..మరోవైపు రాజకీయాల్లో కూడా బిజీగా ఉన్నాడు పవన్ కళ్యాణ్..

Renu Desai
Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here