Pawan Kalyan : పవన్ కల్యాణ్ కొరియోగ్రాఫర్ అని మీకు తెలుసా.. ఆయన కొరియోగ్రఫీ చేసిన పాట ఏదంటే!

- Advertisement -

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ఒక నటుడు గానే కాదు రైటర్‌గా, డైరెక్టర్‌గా, డాన్స్ కొరియోగ్రాఫర్‌గా.. ఇలా సినిమా క్రాఫ్ట్స్ లోని చాలా వాటిలో అనుభవం ఉన్న వ్యక్తి. ఘోస్ట్ రైటర్ గా కొన్ని సినిమాలకు పని చేస్తే.. తన చిత్రాల్లోని కొన్ని సన్నివేశాలు అయితే తానే రాస్తుంటారు. ఇక అలాగే కొన్ని మూవీలోని సాంగ్ పిక్చరైజేషన్ అండ్ కొరియోగ్రఫీ కూడా పవన్ చేస్తుంటారు. ఈక్రమంలోనే గుడుంబా శంకర్, జానీ వంటి సినిమాల్లో పవనే సాంగ్స్ కొరియోగ్రఫీ చేశారు. ఇక రీసెంట్‌గా వచ్చిన ‘బ్రో’ సినిమాలో కూడా పవన్ ఒక సాంగ్ కి చాలా వరకు స్టెప్స్ కంపోజ్ చేశారట.

బ్రో మూవీలో ‘మై డియర్ మార్కండేయ’ పబ్ సాంగ్ అందరికి గుర్తుకు ఉండే ఉంటుంది. పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ తో పాటు బాలీవుడ్ హీరోయిన్ ఊర్వశి రౌతేలా కూడా ఈ పాటలో చిందేసింది. గణేష్ స్వామి, భాను ఈ సాంగ్ ని కొరియోగ్రఫీ చేశారు. అయితే ఈ సాంగ్ లోని ఊర్వశి వేసిన చాలా స్టెప్స్ ని పవన్ కొరియోగ్రఫీ చేశారట. ఈ విషయాన్ని ఊర్వశి రీసెంట్ గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో బయట పెట్టారు.

పవన్ కి సినిమా మీద చాలా అవగాహన ఉందని, డైరెక్షన్ నుంచి ఎడిటింగ్ వరకు ప్రతిదీ ఆయనకు తెలుసని పేర్కొన్నారు. ఇటు సినిమాతో పాటు అటు పాలిటిక్స్ కూడా చేసే పవన్ ని మల్టీ టాలెంటెడ్ అంటూ ప్రశంసలతో ఊర్వశి ముంచెత్తారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here