Bigg Boss Sivaji : తన మనసుకి అనిపించింది అనిపించినట్టుగా ఎలాంటి భయం బెరుకు లేకుండా కుండబద్దలు కొట్టినట్టు చెప్పే మనస్తత్వం ఉన్న వాడిగా శివాజీ బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా మంచి పేరు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఎన్నో ఏళ్ళ నుండి సినిమా ఇండస్ట్రీ లో ఉన్నప్పటికీ, దాదాపుగా వంద సినిమాలకు దగ్గరగా చేసినా రానటువంటి క్రేజ్, ఫాలోయింగ్ ఈ బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా వచ్చింది.

పెద్ద శరీరానికి పని చెప్పకుండా, బుద్ధి బలంగా తో బిగ్ బాస్ షో ని నడిపించాడు శివాజీ. ఇతను లెకపొయ్యుంటే పల్లవి ప్రశాంత్ టైటిల్ గెలిచేవాడు కాదు, యావర్ టాప్ 5 లో అసలు ఉండేవాడు కాదు అనేది అందరి అభిప్రాయం. బయటకి వచ్చిన తర్వాత కూడా వీళ్ళ ముగ్గురి మధ్య అదే రేంజ్ రిలేషన్ కొనసాగుతుంది. ఇదంతా పక్కన పెడితే శివాజీ అయోధ్య రామమందిరం పై చేసిన లేటెస్ట్ కామెంట్స్ కొన్ని ఇప్పుడు సోషల్ మీడియా లో పెను దుమారం రేపింది.

ఆయన మాట్లాడుతూ ‘అయోధ్య లో ఉన్నదే రామ మందిరమా?, రాముడు కేవలం అయోధ్య లో మాత్రమే ఉంటాడా?, మా గ్రామం లో కూడా రామ మందిరం ఉంది. ప్రతీ ఏటా శ్రీరామ నవమి ని ఎంతో అంగరంగ వైభవంగా జరిపిస్తారు. మన భారత దేశం లో మానవుల జీవిన విధానమే రామ తత్త్వం. ఇది అర్థం చేసుకోకుండా కొంతమంది రాజకీయ నాయకులు కేవలం తమ రాజకీయ ప్రయోజనాల కోసమే అయోధ్య లో రామ్ మందిరం లాంటి నాటకాలు ఆడుతూ ఉంటారు’ అంటూ ఆయన చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

ఈ నెల 22 వ తారీఖున అయోధ్య లో రామ మందిరం ప్రారంభోత్సవ వేడుక ఎంతో వైభవం గా జరగబోతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా శివాజీ చేసిన ఈ వ్యాఖ్యలు కొంతమందికి కోపం తెప్పిస్తున్నాయి. శివాజీ గత ఆరేళ్లుగా బీజేపీ కి వ్యతిరేకంగా ఉంటూ వస్తున్నాడు. బీజేపీ పార్టీ మీద అక్కసు తోనే ఆయన ఇలాంటి కామెంట్స్ చేసాడు అంటూ నెటిజెన్స్ విరుచుకుపడుతున్నారు.
