Urvashi Rautela : టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోల సినిమా అనగానే అందులో కచ్చితంగా ఐటమ్ సాంగ్ ఉండాల్సిందే. ఇక అందులో ఈ మధ్య కాలంలో ఆ సాంగ్ చేయాలంటే ఊర్వశీ రౌతేలా ఉండాల్సిందే. తెలుగుతో పాటు పలు భాషల్లో స్పెషల్ సాంగ్స్ చేస్తూ.. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మకు హీరోయిన్ గా బోలెడన్ని అవకాశాలు వస్తున్నాయట. ఈ మధ్య కాలంలో హీరోయిన్ అవకాశాలు వస్తే ఎవరు వదులుకోరు చెప్పండి. హీరోయిన్ గా వచ్చిన తర్వాత ఐటెం గర్ల్స్ గా మారిన వారు కూడా ఉన్నారు. కానీ ఊర్వశీ రౌతేలా మాత్రం కాస్త ఢిఫరెంట్. ఐటమ్ గర్ల్‌గా వచ్చి హీరోయిన్ అవకాశాలు ఇస్తామంటూ దర్శకనిర్మాతలు వచ్చినా వద్దంటుంది.

హీరోయిన్ పాత్రల విషయంలో ఈమె ఈక్వేషన్స్ ఈమెకు ఉన్నాయి. ఒక చిన్న బ్యానర్‌లో చిన్న హీరో సరసన హీరోయిన్గా నటించే కంటే.. ఓ పెద్ద బ్యానర్లో బడా హీరోతో ఐటెం సాంగ్ చేయడం మేలన్నది ఆమె ఒపీనియన్ అంట. అంతేకాదు ఇక్కడ ఇంకో అతి పెద్ద లాజిక్ కూడా చెబుతోంది ఈ చిన్నది. హీరోయిన్ వేషాలకు కక్కుర్తి పడి ఏదైనా సినిమా చేసి ఆ తర్వాత అది ప్లాప్ అయిందంటే ఐటెం భామ గా తెచ్చుకున్న క్రేజ్ కూడా పోతుందని భయపడుతోందట ఈ అమ్మడు.

అంతేకాదు అలాంటి ఫ్లాప్ తర్వాత తనకు ఇక ఐటెం సాంగ్ అవకాశాలు కూడా రావన్న సమాధానం కూడా చెబుతోంది. అందుకే హీరోయిన్ అవకాశాలు వద్దని వాటిని పక్కనపెట్టి.. కేవలం ఐటెం సాంగ్స్ మాత్రమే చేస్తానంటుంది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవడంతో తన ఆలోచన కరెక్టేకదా అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరేమో ఊర్వశీ రౌతేలా హీరోయిన్ గా చూడాలని అనుకుంటున్నామంటూ కామెంట్స్ చేస్తున్నారు.