Naga Vamshi : అవన్నీ తప్పుడు లెక్కలు.. ఆ సినిమాకు అంత కలెక్షన్లు రానేలేదు.. నిజం బయటపెట్టిన నిర్మాత

- Advertisement -


Naga Vamshi : ఇటీవల కాలంలో వరుస సినిమాలు చేస్తూ ఫుల్ ఫాంలో దూసుకుపోతున్న నిర్మాత సూర్య దేవర నాగవంశీ. సినిమా ఇండస్ట్రీలో జరిగే ఎలాంటి విషయాన్ని నైనా సరే నిర్మొహమాటంగా చెప్పే నిర్మాతల్లో ఆయన ముందు వరుసలో నిలుస్తారు. ఎలాంటి విషయాన్ని అయినా ఉన్నది ఉన్నట్లు ధైర్యంగా చెబుతుంటారు. ఈయన సితార ఎంటర్టైన్మెంట్ అధినేత గా పేరు సంపాదించారు. ఇటీవలే కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన లియో సినిమాని తెలుగులో రిలీజ్ చేశారు. ఈ సినిమా సక్సెస్ లో భాగంగా ఇటీవల ఓ ప్రెస్ మీట్లో పాల్గొన్నారు.

Naga Vamshi
Naga Vamshi

అక్కడ ఆయన మీడియా ప్రతినిధులతో ముచ్చటించారు. ఆయన నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ నుంచి వచ్చిన సినిమాలలో నాని హీరోగా వచ్చిన జెర్సీ సినిమా కూడా ఒకటి. ఈ చిత్రానికి నిర్మాతలకు డబ్బులు రాలేదని ఇటీవల ఆ సినిమా హీరో నానిని పలువురు జర్నలిస్టులు ప్రశ్నించారు. ఇదే విషయాన్ని ప్రెస్ మీట్లో నిర్మాత నాగ వంశీ దగ్గర కూడా ప్రస్తావించారు. ఈ విషయం పైన ఆయన కాస్త ఘాటుగానే స్పందించారు. అసలు మీడియాకు తెలిసే లెక్కలన్నీ నిజాలు కాదని అవన్నీ కేవలం పుకార్లని తెలియజేశారు. అసలు నిర్మాతలు లెక్కలన్నీ ఎందుకు బయటికి చూపెడతారంటూ ప్రశ్నించారు.

సినిమా హిట్టా ఫట్టా అనే విషయంపై మీడియాకు ఓ వార్తను వదిలిపెడతామని.. మేము చేసే వ్యాపారాన్ని రోడ్డుమీద ఎందుకు పెట్టుకుంటామన్నారు.. ఎవరికివారు తోచిన విధంగా వారు ఫిగర్ ను బట్టి మీడియా ప్రతినిధులు రాసుకుంటూ ఉంటారని నాగవంశీ అన్నారు. అసలు విషయాన్ని మాత్రం ఏ ఒక్క నిర్మాత ఇప్పటి వరకు మీడియా ప్రతినిధులకు చెప్పలేదన్నారు. ఇక సినిమా నిర్మాణ సంస్థలు వేసే పోస్టర్ల విషయంపై కూడా ఆయన మాట్లాడారు. తీసిన సినిమాకు నేను ఎంత బిజినెస్ చేశానో.. ఎంత ఖర్చు చేశాను.. ఎంత వసూలు చేసిందన్న విషయాలు ఎందుకండి జనాలకు.. అది తలనొప్పి యవ్వారం. సినిమా తీసిన నాకు పోయినా ఎవరూ ఇవ్వరు. ఒక హీరోని ఎదురుగా కూర్చోబెట్టుకుని ఎందుకు ఇవన్నీ అంటూ పోస్టర్ల మీద వేసే కలెక్షన్స్ గురించి కామెంట్ చేశారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here