Urfi Javed పరిస్థితి ఇంత దారుణంగా మారిందా.. కనీసం ఇల్లు కూడా లేదు..!!

- Advertisement -

Urfi Javed .. ఈ పేరు తెలియని వాళ్ళు బహుశా ఉండరు.. హిందీ బిగ్ బాస్ ద్వారా బాగా పాపులర్ అయ్యింది..ఆ తర్వాత కూడా విభిన్నమైన వస్త్రధారణతో పెద్ద ఎత్తున వార్తల్లో నిలిచారు.ఇలా అర్థనగ్న ప్రదర్శన చేస్తూ ఈమె రోడ్లపై తిరగడంతో ఈమె వ్యవహార శైలి చూసి కొందరు ఈమె పై కేసులు కూడా నమోదు చేశారు. గత కొన్ని రోజులుగా ఈ వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది.ఇలా వార్తల్లో నిలవడమే కాకుండా ఈమె ఎన్నో వివాదాలను కూడా ఎదుర్కొంటున్నారు.. అంతేకాదు ప్రస్తుతం ఈమె పరిస్థితి దారుణంగా మారిందట కనీసం ఉండటానికి ఇల్లు కూడా దొరకలేదని టాక్..

Urfi Javed
Urfi Javed

ఈ విషయం పై ఉర్ఫి జావేద్ సోషల్ మీడియా వేదికగా తన ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత పెద్ద మహానగరమైన ముంబైలో తనకు ఉండటానికి కనీసం ఇల్లు ఎవరూ కూడా అద్దెకు ఇవ్వడం లేదు అంటూ ఉర్ఫి జావేద్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా ట్విట్టర్ వేదికగా ఈమె స్పందిస్తూ నా వస్త్రధారణ కారణంగా కొందరు ముస్లింలు తనకు ఇల్లు అద్దెకు ఇవ్వడం లేదని,తాను ముస్లిం కావడంతో ఇదే కారణం చూపిస్తూ హిందువులు కూడా ఇల్లు అద్దెకు ఇవ్వడం లేదని తెలిపారు. మరికొందరు మాత్రం తనకు వస్తున్న రాజకీయ బెదిరింపులకు భయపడి ఇల్లు అద్దెకు ఇవ్వడానికి వెనకడుగు వేస్తున్నారని తెలిపారు.

Urfi Javed  Photos

ఇలా ముంబైలో తాను అద్దెకు ఉండడానికి అపార్ట్మెంట్ దొరకడం లేదు అంటూ ఈమె తన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ఈమె చేసిన ట్వీట్ కి ఒక నెటిజన్ రిప్లై ఇస్తూ నాకు కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. మీకు ఇల్లు దొరకాలని కోరుకుంటున్నా అని రిప్లై ఇచ్చారు.. ఈ విషయం పై కొందరు ప్రముఖులు కూడా స్పందించారు.. ఏదైనా లిమిట్ లో ఉంటే అందం, హద్దులు దాటితే పరమ బూతు అన్నట్లు తెలుస్తుంది.. అందాల ప్రదర్శన చేస్తున్న వారికి ఇది గుణపాఠం అవుతుందని కొందరు అంటున్నారు..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here