పెళ్లైన 11 ఏళ్లకు బిడ్డ పుట్టడంతో రామ్ చరణ్ దంపతుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఇక మనవరాలి రాకతో చిరంజీవి- సురేఖ కూడా మురిసిపోయారు. అభిమానులు కూడా సంబరాలు చేసుకున్నారు. ఆ తర్వాత వేడుకగా బారసాల చేసి మెగా ప్రిన్సెస్‌కు క్లింకార కొణిదెల అని నామకరణం చేశారు. కాగా అమ్మగా ప్రమోషన్ పొందిన తర్వాత తొలిసారిగా ఉపాసన తన పుట్టింటికి వెళ్లిందట. అక్కడ ఆమె తల్లి కామినేని శోభన మనవరాలికి స్వాగతం పలికేందుకు గ్రాండ్‌గా ఏర్పాట్లు చేశారట.

రామ్ చరణ్ కూతురు ఎప్పుడైతే మెగా ఫ్యామిలీలోకి అడుగుపెట్టిందో అప్పటినుండి మెగా ఫ్యామిలీ లో అన్ని శుభశకునాలే జరుగుతున్నాయి. ఇప్పటికే వరుణ్ తేజ్ లావణ్య ల పెళ్లి ఫిక్స్ అవడం, రామ్ చరణ్ నటించిన సినిమాలోని పాటకి ఆస్కార్ అవార్డు రావడం. రామ్ చరణ్ కి గ్లోబల్ రేంజ్ రావడం. అయితే ఉపాసన తన బిడ్డను తీసుకొని పుట్టింటికి వెళ్ళినప్పుడు మొదటిసారి ఉపాసన తల్లి శోభన కామినేని చేసిన పని తెలిసిన చాలా మంది నెటిజన్స్ షాక్ అవుతున్నారు.

తన మనవరాలిని ఇంట్లోకి తీసుకొచ్చేముందుకు పనివాళ్లతో దిష్టి తీయించిందట. అంతేకాదు.. వారికి ఏకంగా రూ. 10 లక్షలు ఇచ్చారట. ఇప్పుడీ వార్త టాలీవుడ్ ఫిల్మ్ సర్కిల్స్‌లో తెగ చక్కర్లు కొడుతోంది. సాధారణంగా దిష్టి తీస్తే వందలు, వేలు ఇస్తారు. అయితే మనవరాలు క్లింకార ఇంటికొచ్చిన సందర్బంగా పనివాళ్లకు ఏకంగా రూ. 10 లక్షలు ఇవ్వడంపై చాలామంది ఆశ్చర్యపోతున్నారు. అదే సమయంలో మెగాభిమానులు మాత్రం ఈ శుభసందర్భంలో పనివాళ్లకు మంచి బహుమతినే ఇచ్చారు కదా అంటూ కామెంట్లు పెడుతున్నారు.