Upasana Konidela : అంబానీ కి కోడలిగా వెళ్లాల్సిన ఉపాసన చివరికి రామ్ చరణ్ ని పెళ్లి చేసుకోడానికి వెనుక ఇంత పెద్ద కథ ఉందా!

- Advertisement -

Upasana Konidela : సౌత్ ఇండియాలోనే మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్ లిస్ట్ తీస్తే అందులో రామ్ చరణ్ , ఉపాసన జంట కచ్చితంగా ఉంటుంది. ఈ ఇద్దరి జంట ఎంతో మంది దంపతులకు ఆదర్శప్రాయం అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇటీవలే ఈ జంట క్లిన్ కారా అనే పాపకు జన్మనిచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ పాపతో కలిసి దిగిన ఫోటోలను ఇది వరకు చాలానే సోషల్ మీడియా లో అప్లోడ్ చేశారు కానీ, ఒక్కసారి కూడా పాప ముఖం చూపించలేదు.

Upasana Konidela
Upasana Konidela

అభిమానులు ఈ విషయం లో మాత్రం కాస్త నిరాశతోనే ఉన్నారు. ఇదంతా పక్కన పెడితే, రామ్ చరణ్ భార్య, చిరంజీవి కోడలు అనే ట్యాగ్ పక్కన పెడితే, ఉపాసన కొణిదెల అంటే ఏమిటి అనేది అందరికీ తెలిసిందే. ఆస్తి పరంగా, డబ్బుల సంపాదన పరంగా చూస్తే ఆమె మెగా కుటుంబం లో అందరికంటే ఉన్నత స్థాయిలో ఉందనే చెప్పాలి.

Ram Charan Upasana Konidela

ఎందుకంటే ఇండియా వైడ్ గా ఉన్న అపోలో హాస్పిటల్స్ కి ఉపాసన చైర్ పర్సన్ కాబట్టి. అంత ఉన్నతస్థాయిలో ఉన్న ఉపాసనకు, రామ్ చరణ్ తో పెళ్లి కాకముందు అలాంటి సంబంధాలే వచ్చేవట. ముఖేష్ అంబానీ పెద్ద కొడుకు ఆకాష్ అంబానీ తో ఉపాసనకు పెళ్లి చెయ్యాలని ముఖేష్ అంబానీ అప్పట్లో అనుకున్నాడట. ఇంట్లో పెద్దలతో మాట్లాడిన తర్వాత, ఈ విషయాన్ని ఉపాసన తో చెప్పగా, అప్పుడు ఆమె రామ్ చరణ్ తో ప్రేమలో ఉన్న విషయాన్ని ఇంట్లో చెప్పిందట.

- Advertisement -

దీంతో ఆకాష్ అంబానీ తో ఉపాసన పెళ్లి క్యాన్సిల్ అయ్యి, రామ్ చరణ్ తో జరిగింది. వీళ్ళ పెళ్లి జరిగి సుమారుగా 12 ఏళ్ళు కావొస్తుంది. ఈ 12 ఏళ్లలో వీళ్ళ మధ్య ఎన్నో గొడవలు జరిగి ఉండొచ్చు. భార్యాభర్తల సంబంధం అన్న తర్వాత అలాంటివి సర్వసాధారణం. కానీ వాటి అన్నిటినీ విజయవంతంగా దాటుకొని నేడు ఆదర్శ దంపతులుగా నిలవడం నిజంగా గ్రేట్ అనే చెప్పాలి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here