Upasana Konidela : పెళ్లి జరిగి 11 ఏళ్ళ తర్వాత రామ్ చరణ్, ఉపాసన ఒక ఆడబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఆ చిన్నారి కి క్లిన్ కారా అనే పేరు కూడా పెట్టారు. ఎంతో అపురూపంగా, ఒక గాజుబొమ్మ లాగ ఆ బేబీ ని చేసుకుంటున్నారు రామ్ చరణ్, ఉపాసన. ఒకపక్క రామ్ చరణ్ సినిమాల షూటింగ్స్ తో బిజీ గా ఉండగా, మరోపక్క ఉపాసన అపోలో హాస్పిటల్స్ పనుల్లో ఫుల్ బిజీ గా ఉంటుంది.

దీంతో ఇద్దరికీ కూడా క్లిన్ కారా బాగోగులు చూసుకోవడం బాగా కష్టమైపోతున్న ఈ నేపథ్యం లో, లక్షల రూపాయిలు ఖర్చు చేసి ఒక ఆయా ని పెట్టుకున్న సంగతి మన అందరికి తెలిసిందే. ఇది ఇలా ఉండగా వైద్య రంగం లో ఉండడం తో ఉపాసన అప్పుడప్పుడు సోషల్ మీడియా ద్వారా అభిమానులకు ఆరోగ్యానికి సంబంధించిన కొన్ని టిప్స్ ని చెప్తూ ఉంటుంది.

రీసెంట్ గా ఆమె ఒక ఈవెంట్ లో పాల్గొనింది, ఈ ఈవెంట్ లో తన రెండవ ప్రెగ్నన్సీ పై ఉపాసన చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఆమె మాట్లాడుతూ ‘ఆడవాళ్ళకు బిడ్డల్ని ఎప్పుడు కనాలి అనే విషయం లో స్వేచ్ఛ ఉంటుంది. నేను నాకు ఉన్న కొన్ని లక్ష్యాల కారణంగా పిల్లల్ని లేట్ గా కనాలని అనుకున్నాను. నాతో పాటుగా నా పక్కనున్న ఆమె కూడా అలాగే అనుకుంది.ఇప్పుడు నేను రెండవ సారి ప్రెగ్నన్సీ అవ్వడానికి కూడా సిద్దంగానే ఉన్నాను. మీ బాధ మీకు తెలుస్తుంది. అలాగే మీ ఫ్యామిలీ కి కూడా అర్థం అవుతుంది. ఆడవాళ్లు ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం పట్ల అవగాహనా కల్పించాల్సిన బాధ్యత నాకు కూడా ఉంది కాబట్టే ఈ కార్యక్రమానికి హాజరయ్యాను’ అని చెప్పుకొచ్చింది ఉపాసన కొణిదెల.