Anirudh Ravichander : ఇష్టం లేకపోతే వేరే మ్యూజిక్ డైరెక్టర్ ని చూసుకోండి అంటూ ‘దేవర’ టీం పై మండిపడ్డ అనిరుధ్!

- Advertisement -

Anirudh Ravichander : ప్రస్తుతం సౌత్ లో టాప్ మోస్ట్ మ్యూజిక్ డైరెక్టర్స్ లిస్ట్ తీస్తే అందులో అనిరుధ్ కచ్చితంగా అందరికంటే ముందు ఉంటాడు. అందులో ఎలాంటి సందేహం లేదు. అతను మ్యూజిక్ అన్నా, గాత్రం అన్నా, సౌండ్ మిక్సింగ్ అన్నా ఆడియన్స్ చెవులు కోసేసుకుంటారు. ఆ రేంజ్ బ్రాండ్ ఇమేజి ని సంపాదించుకున్నాడు. చేతిలో కనీసం పది సినిమాలు ఉంటాయి. అందుకే డైరెక్టర్స్ కి ఆయన అనుకున్న సమయం లో మ్యూజిక్ అందించలేకపోతున్నాడు.

Anirudh Ravichander
Anirudh Ravichander

మన టాలీవుడ్ లో ఆయన ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ తో ‘దేవర’ అనే చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతుంది. అయితే ఈ సినిమాని ఏప్రిల్ 5 వ తారీఖున విడుదల చెయ్యాల్సి ఉండగా, వర్క్ ఇంకా చాలా వరకు పెండింగ్ లో ఉండడం తో అక్టోబర్ 10 వ తేదికి వాయిదా పడింది. ఇలా వాయిదా పడడానికి గ్రాఫిక్స్ వర్క్ ఒక కారణం అయితే అనిరుధ్ రెండవ కారణం.

అనిరుధ్ అనుకున్న సమయానికి ఒక ట్యూన్ కూడా అందించడం లేదట. ఇటీవలే మూవీ టీం రెండు పాటల చిత్రీకరణని ప్లాన్ చేసుకుంది. పెద్ద షెడ్యూల్ లో ఈ రెండు పాటలను తెరకెక్కించాలని అనుకున్నారు. కానీ ఈ రెండు పాటలను సమయానికి అనిరుధ్ అందించకపోవడం తో కొరటాల శివ అతనిపై అసహనం వ్యక్తం చేసాడట.

- Advertisement -

దీనికి ఫైర్ అయిన అనిరుధ్ ‘నాతో సినిమా అంటే ఇలాగే ఉంటుంది సార్. నాకు తీరిక సమయం ఉన్నప్పుడు మాత్రమే చేస్తా, నేనిచ్చినప్పుడే తీసుకోండి , లేదంటే వేరే మ్యూజిక్ డైరెక్టర్ ని పెట్టుకోండి, మీ అడ్వాన్స్ వెనక్కి ఇచ్చేస్తా’ అని అన్నాడట. దీంతో సందిగ్ధం లో పడ్డ కొరటాల శివ, అనిరుధ్ ని గట్టిగ అడిగితే ఈ ప్రాజెక్ట్ నుండి ఎక్కడ తప్పుకుంటాడో అనే భయం తో అతనితో ప్రయాణం అలా కొనసాగిస్తున్నాడట, అందుకే దేవర చిత్రం విడుదల వాయిదా పడింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here