Ram charan – Upasana : సౌత్ ఇండియా లోనే మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్ లో ఒకరిగా పేరు తెచ్చుకున్న జంట రామ్ చరణ్ – ఉపాసన జంట.వీళ్లిద్దరు ప్రేమించి పెళ్లి చేసుకొని సుమారు పదేళ్ల సమయం పట్టింది.ఈ పదేళ్ల సమయం లో వీరి మధ్య చోటు చేసుకున్న కొన్ని సంఘటనలను రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూ లో పంచుకుంది ఉపాసన కొణిదెల.పెళ్ళైన కొత్తలో తన గురించి సోషల్ మీడియా లో వచ్చిన నెగటివ్ కామెంట్స్ గురించి చాలా ఎమోషనల్ గా చెప్పుకొచ్చింది.
ఆమె మాట్లాడుతూ ‘పెళ్ళైన కొత్తలో నేను చాలా నెగటివిటీ ని ఎదురుకున్నాను.బాడీ షేమింగ్ కి కూడా గురయ్యాను, ఏంటి ఈ అమ్మాయి ఇంత ఛండాలంగా ఉంది, రామ్ చరణ్ రేంజ్ కి ఈమెనా..?, కేవలం ఆస్తులను చూసే చరణ్ పెళ్లి చేసుకున్నాడా లాంటి కామెంట్స్ ఎన్నో విన్నాను.కానీ నేను వాళ్ళని తప్పుబట్టను, ఎందుకంటే అప్పట్లో నా గురించి వాళ్ళకేమి తెలియదు కాబట్టి అలా అనుకున్నారు, కానీ ఈ పదేళ్లలో నేనేంటో వాళ్లకి బాగా అర్థం అయ్యే ఉంటుంది.అప్పట్లో నా మీద ఉన్న అభిప్రాయం కూడా మారిపొయ్యుంటాది అని అనుకుంటున్నాను’ అంటూ ఉపాసన ఈ సందర్భంగా మాట్లాడింది.
ఇన్ని సంవత్సరాల మీ దాంపత్య జీవితం లో ఎలాంటి గొడవలు జరగలేదా అని అడిగిన ప్రశ్న కి ఉపాసన సమాధానం చెప్తూ ‘గొడవలు లేకపోతే ఏ రిలేషన్ కూడా బలంగా ఉండదు.ప్రతీ రిలేషన్ లోను కచ్చితంగా గొడవలుంటాయి.మా మధ్య కూడా ఎన్నో సార్లు గొడవలొచ్చాయి, కానీ ఎంత పెద్ద గొడవ జరిగిన ఒక గంటకి మించి మాట్లాడుకోకుండా ఉండలేము’ అంటూ చెప్పుకొచ్చింది ఉపాసన.
ఇది ఇలా ఉండగా ‘గోవిందుడు అందరివాడేలే’ సినిమా అప్పుడు కాజల్ అగర్వాల్ తో హద్దులు దాటి రొమాన్స్ చెయ్యాల్సి వచ్చింది రామ్ చరణ్ కి, ఆ సమయం లో ఉపాసన గొడవలు పెట్టుకున్నట్టు ఇండస్ట్రీ వర్గాల్లో అప్పట్లో రూమర్ వినిపించేది.బహుశా ఉపాసన చెప్పిన గొడవలు దాని గురించే ఏర్పడింది అనుకోవచ్చు.ప్రస్తుతం ఆమె గర్భం దాల్చిన సంగతి అందరికీ తెలిసిందే.ఈ ఏడాది ఆగష్టు లేదా, సెప్టెంబర్ నెలలో బిడ్డకి జన్మని ఇవ్వబోతుంది ఉపాసన.