ఎప్పుడెప్పుడా అని మెగా అభిమానులంతా ఎదురుచూసిన రోజు వచ్చేసింది. మెగా ఇంట మహాలక్ష్మి అడుగుపెట్టింది. మెగా కోడలు ఉపాసన పండండి ఆడపిల్లకు జన్మనిచ్చినట్లు అపోల్ వైద్యులు ప్రకటన విడుదల చేశారు. తల్లి బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నట్లు ట్వీట్ చేశారు. దీంతో సోషల్ మీడియాలో సంబరాలు చేసుకుంటున్నారు. ఉపాసనలకు 2012లో వివాహమైన సంగతి తెలిసిందే. వీరిద్దరు తల్లిదండ్రులు కాబోతున్నట్టు గతేడాది డిసెంబరు 12న ఇరు కుటుంబాలు వెల్లడించాయి. కొన్ని రోజుల క్రితం ఉపాసన సీమంతం వేడుకను ఘనంగా నిర్వహించారు.

మరోవైపు ఉపాసన, రామ్ చరణ్ దంపతుల బిడ్డ కోసం యువ సంగీత దర్శకుడు, గాయకుడు కాల భైరవ అద్భుతమైన ట్యూన్ ను ఇంతకు ముందే రూపొందించాడు. ఈ ట్యూన్ విని చిన్నారులు ఆనందంలో మునిగిపోయేలా ఉందని రామ్ చరణ్, ఉపాసన దంపతులు ట్వీట్ చేశారు. ఇంత చక్కటి ట్యూన్ క్రియేట్ చేసినందుకు ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పారు. ఈ ట్యూన్ ను ట్వీటర్ ద్వారా వీడియో రూపంలో షేర్ చేశారు. కాల భైరవ ట్యూన్ పై రామ్ చరణ్ దంపతులు ఉప్పొంగిపోయారు. “ఈ ట్యూన్ మా కోసం ప్రత్యేకంగా తయారు చేసినందుకు థ్యాంక్యూ కాల భైరవ. ఈ భూమ్మీద ఉన్న లక్షల మంది చిన్నారుల్లో ఈ మెలోడి ట్యూన్ సంతోషాన్ని, ఆనందాన్ని తీసుకొస్తుందని నమ్ముతున్నాం.” అని రామ్ చరణ్ ట్వీట్ చేశారు.

రామ్ చరణ్ మూడు నెలల పాటు షూటింగ్‌లకు బ్రేక్ తీసుకున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఉపాసన ప్రసవం నేపథ్యంలో వారికి పూర్తి టైం కేటాయించడానికి రామ్ చరణ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే దీని గురించి ఎటువంటి అధికారిక సమాచారం రాలేదు. ఈ సమయంలో ఎలాంటి వర్క్ టెన్షన్స్ లేకుండా ఉండాలని రామ్ చరణ్ అనుకుంటున్నారని ఇండస్ట్రీ టాక్. అంతే కాదు ఈ సమయంలో ఉపాసనతో ఉండడం కుటుంబానికి చాలా ముఖ్యం కావున ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. నిజానికి గత నెల నుంచే చెర్రీ షూటింగ్స్ కు దూరంగా ఉంటున్నారు.