తన కొడుకు రామ్ చరణ్ వారసులను ముద్దాడాలి అని చిరంజీవి ఎప్పటినుండో కలలు కనేవారు. ఇక ఆ కలలు రామ్ చరణ్ ఉపాసన పెళ్ళయ్యాక దాదాపు 11 సంవత్సరాలకు నెరవేరాయి అని చెప్పుకోవచ్చు. అయితే చాలామందికి ఒక డౌట్ ఉంటుంది. ఎందుకంటే అంత పెద్ద ఫ్యామిలీ 11 సంవత్సరాలుగా పిల్లలు లేకపోవడంతో ఎవరికి డాక్టర్లకు చూయించుకోలేదా అని.కానీ అసలు విషయం మరోటి ఉంది.

దానికి ప్రధాన కారణం ఉపాసన రాంచరణ్ అప్పుడప్పుడే తమ తమ పనుల్లో బిజీగా ఉన్నారు. ఇక అలాంటి టైంలో తమకు బిడ్డ పుడితే బిడ్డకు టైం కేటాయించే సమయం లేకపోవడం వల్ల బిడ్డతో గడిపే సంతోషమైన క్షణాలు దూరమవుతాయి. అంతేకాకుండా బిడ్డ కి సంబంధించి అన్ని రకాల పనులు చూసుకోవడానికి వీలుండదని ఆగారట.
అంతేకాకుండా గతంలో ఉపాసన ఒక ఇంటర్వ్యూలో ఈ విధంగా మాట్లాడారు.. అందరూ కూడా మీరు తల్లిదండ్రులు ఎప్పుడు కాబోతున్నారు అని ఎదురుచూస్తున్నారు అనే ప్రశ్నకు ఉపాసన ఈ విధంగా స్పందించారు. అది మా జీవితంలో చాలా ముఖ్యమైనది. కానీ పిల్లలు పెంపకం అనేది ఒక 20 ఏళ్ల ప్రాజెక్టు లాంటిది. ఒక విధంగా అది లైఫ్ లాంగ్ ప్రాజెక్ట్ అయినప్పటికీ కూడా 20 ఏళ్ళు అనేది చాలా ముఖ్యం. వారితో చాలా క్లోజ్ గా వెళుతూ ఉండాలి.. అని ఉపాసన అన్నారు.

పిల్లల జీవితాలకు పేరెంట్స్ తప్పనిసరిగా 20 ఏళ్ల జీవితం అంకితం ఇవ్వాల్సి ఉంటుంది. వాళ్లకు కావాల్సినవి సమకూర్చాలి. తప్పకుండా మేము వాటిని పుట్టబోయే పిల్లలకు అందించాలి అనే ఆలోచనతోనే ఉన్నాము. దానికోసం కొంత నాలెడ్జ్ కూడా అవసరం. ఎంతో జాగ్రత్తగా పిల్లలను పెంచాలి. ఆ శుభతోరణం కోసం మానసికంగా శారీరకంగా కూడా సిద్ధంగా ఉండాల్సిన అవసరం ఉంది.. అని ఉపాసన తెలిపారు.