ప్రభాస్ గురించి కొత్తగా పరిచయ వ్యాఖ్యలు అవసరం లేదు. కృష్ణంరాజు నట వారసుడిగా తెలుగు సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి ప్యాన్ ఇండియా స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. త్వరలో ఆదిపురుష్ సినిమాతో పలకరించబోతున్నాడు. ఈ నేపథ్యంలో ప్రభాస్‌కు ఓ సొంత అన్న ఉన్నాడనే సంగతి చాలా మందికి తెలియదు. సూర్య నారాయణ రాజు (కృష్ణం రాజు తమ్ముడు) కి ముగ్గురు సంతానం. అందులో అందరికంటే పెద్ద కుమార్తె ప్రగతి, రెండవవాడు ప్రబోధ్, ఇక చివరి సంతానం మన ప్రభాస్.

ప్రబోధ్ ప్రభాస్ కంటే చాలా పొడవైన మనిషి. కటౌట్ హీరో కి ఏమాత్రం తీసిపోదు.కానీ ఎందుకో ఆయన సినీ రంగం లోకి అడుగుపెట్టలేదు.కానీ తన మిత్రులు స్థాపించిన యూవీ క్రియేషన్స్ సంస్థకి ఫైనాన్స్ ఇస్తూ ఉంటాడు ప్రభోద్. సినిమా నిర్మాతగా మారితే ఒక్కోసారి లాభాలు రావొచ్చు, అలాగే నష్టాలు వచ్చినప్పుడు సూన్యం అయిపోవచ్చు. అందుకే ఎలాంటి సమస్య లేకుండా ఫైనాన్స్ చేస్తూ ఉంటాడు ఈయన.

అయితే ప్రభోద్ గతంలో చెక్ బౌన్స్ కేసులో అరెస్ట్ అయ్యి, సుమారుగా ఏడాదిపాటు జైలు జీవితం గడిపాడని అందరికీ తెలిసిన విషయమే. ఆ సమయం లో ఆయన వ్యాపారాలు కూడా దెబ్బ తిన్నాయట.కానీ బయటకి వచ్చిన తర్వాత ఎంత స్పీడ్ గా అయితే క్రింద పడ్డాడో, అంతే స్పీడ్ గా వ్యాపార రంగం లో పైకి వచ్చాడు. ప్రస్తుతం ఆయన ఇండస్ట్రీలో ఉన్న టాప్ కోటీశ్వరుల్లో ఒకరుగా ఉన్నారట. ప్రభాస్ కూడా తన సినిమాల్లో వచ్చిన రెమ్యునరేషన్ కొంత భాగాన్ని ఆయనతో కలిసి వ్యాపారంలో పెట్టుబడి పెడతాడని టాక్.