Uday Kiran : రీ రిలీజ్ కి ఉదయ్ కిరణ్ సినిమాలు రెడీ..!

- Advertisement -

Uday Kiran : దివంగత నటుడు ఉదయ్ కిరణ్ గురించి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు. ఉదయ్ కిరణ్ ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఏ విధమైనటువంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా అడుగుపెట్టి సక్సెస్ అవడం అనేది ఎంతో కష్టం. కానీ ఉదయ్ కిరణ్ మాత్రం ఏ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి రావడం జరిగింది. పైగా సక్సెస్ ని కూడా అందుకున్నారు.

uday kiran
uday kiran

అది కూడా కొంత కాలానికి. చిత్రం అనే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులు ముందుకి వచ్చారు ఉదయ్ కిరణ్. ఆ సినిమాతో మంచి సక్సెస్ ని అందుకున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు టాలీవుడ్ లో రీ రిలీజ్ ట్రెండ్ బాగా నడుస్తోంది. చాలా మూవీస్ రీ రిలీజ్ అవుతున్నాయి. ఉదయ్ కిరణ్ మరణించినప్పటికీ అభిమానులు ఇప్పటికే ఆయనని మర్చిపోలేదు. ఉదయ్ కిరణ్ నటించిన సినిమాల్లో ఎన్నో హిట్ సినిమాలు ఉన్నాయి ముఖ్యంగా కెరియర్ కి టర్నింగ్ పాయింట్ అయినటువంటి నువ్వు నేను, మనసంతా నువ్వే ఎవర్ గ్రీన్ సినిమాలు.

తేజ దర్శకత్వంలో వచ్చిన నువ్వు నేను విఎన్ ఆదిత్య దర్శకత్వంలో వచ్చిన మనసంతా నువ్వే సినిమాలు మార్చి లేదా ఏప్రిల్ నెలలలో రీ రిలీజ్ అవ్వబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ రెండు సినిమాలు కూడా రీ రిలీజ్ అవుతాయి అనే దాని గురించి అధికారిక ప్రకటన రాలేదు. త్వరలోనే ఈ విషయానికి సంబంధించి అధికారిక ప్రకటన రాబోతుందని తెలుస్తోంది.

- Advertisement -

చాలా రోజుల తర్వాత ఉదయ్ కిరణ్ సినిమాలను తిరిగి థియేటర్లలో చూడబోతున్నామని ఫ్యాన్స్ కుష్ అవుతున్నారు. స్టార్ హీరోగా ఒక వెలుగు వెలుగు నటువంటి ఉదయ్ కిరణ్ కెరియర్ ఒకానొక సందర్భంలో అమాంతం ఆగిపోయింది అవకాశాలు లేక ఆర్థిక ఇబ్బందులు వెంటాటంతో ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకుని చనిపోయారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here