Anchor Suma : ప్రముఖ టీవీ యాంకర్ సుమ అరెస్ట్.. కారణం అదేనా?

- Advertisement -

Anchor Suma : ఈమధ్య టాలీవుడ్ లో ప్రొమోషన్స్ మొత్తం కొత్త తరహాలో ఉండేట్టు చూసుకుంటున్నారు మేకర్స్, బాలీవుడ్ తరహా లో సరికొత్త ఐడియాస్ తో సినిమా కాన్సెప్ట్ ని జనాల్లోకి బలంగా తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు. రీసెంట్ గా ప్రముఖ హీరో అల్లరి నరేష్ కూడా ఇదే పద్దతి ని ఫాలో అవుతున్నాడు. ఎప్పుడూ కామెడీ సినిమాలతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే అల్లరి నరేష్ ఈమధ్య రూట్ మార్చి కొత్త తరహా సినిమాలు చేస్తున్నాడు.

Anchor Suma
Anchor Suma

వాటిల్లో సీరియస్ సబ్జక్ట్స్ ఉంటున్నాయి, అలాగే యాక్షన్ మూవీస్ కూడా ఉంటున్నాయి. అలా ఆయన హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ఉగ్రం, అతి తావరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా అల్లరి నరేష్ ఇప్పటి నుండే ప్రొమోషన్స్ చెయ్యడం ప్రారంభించేసాడు .ఇందులో అల్లరి నరేష్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించాడు. ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ని కూడా ఇటీవలే విడుదల చేసారు, మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది.

ఇది ఇలా ఉండగా ఈ సినిమా ప్రొమోషన్స్ కోసం ప్రముఖ టీవీ యాంకర్ సుమ తో సరికొత్తగా ప్లాన్ చేసాడు అల్లరి నరేష్. ఆమెని ఒక పోలీస్ జీప్ లో అరెస్ట్ చేసి బేడీలు వేసి ఉన్న ఫోటో ఒకటి సోషల్ మీడియా లో వదిలారు. ముందుగా ఈ ఫోటో రాగానే అందరూ ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. అయ్యో సుమ ని ఎందుకు అరెస్ట్ చేసారు,ఏమైంది అనుకున్నారు.

- Advertisement -

కానీ ఆ తర్వాత కాసేపటికి అల్లరి నరేష్ ఆ ట్వీట్ ని క్వాట్ చేస్తూ CI శివ కుమార్ ఆన్ డ్యూటీ, మీ అభిమాన యాంకర్ సుమ ఇప్పుడు నా కస్టడీలో ఉంది అంటూ ఒక ట్వీట్ పెట్టాడు. దీనికి ఫ్యాన్స్ నుండి షాకింగ్ రెస్పాన్స్ షాకింగ్ రెస్పాన్స్ వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో ని ఈరోజు 5 గంటలకు విడుదల చేయబోతున్నారట.ప్రమోషన్ ఐడియా చాలా పాతది, ఇంకా కొత్తగా ట్రై చెయ్యాల్సింది అంటూ కొంతమంది నెటిజెన్స్ కామెంట్ చేస్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here