Project K : ఐరన్ మ్యాన్ డూప్ లా ఉన్న ప్రాజెక్ట్ కె ప్రభాస్ ఫస్ట్ లుక్..

- Advertisement -

Project K : ప్రభాస్ నుంచి భారీ హిట్ ఎక్స్పెక్ట్ చేస్తున్న అతని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ప్రాజెక్ట్ కె. ఈ చిత్రానికి సంబంధించి అప్డేట్ కోసం ఆశిస్తున్న డార్లింగ్ ఫాన్స్ ప్రభాస్ ఫస్ట్ లుక్ పోస్టర్ చూసి షాక్ అయ్యారు. ప్రస్తుతం దీనికి సంబంధించి పలు రకాల మీమ్స్ చేసి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ లో ప్రభాస్ లుక్ కలర్ మార్చిన ఐరన్ మాన్ యూనిఫామ్ లో ఉంది.

Project K
Project K

ఆది పురుష్ గ్రాఫిక్స్ కి తికమక పడ్డ ఫ్యాన్స్ ఇప్పుడు ఇది మరో గ్రాఫిక్ డిజాస్టర్ అవుతుందేమో అని తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సుమారు 600 కోట్ల బడ్జెట్ తో రూపొందుతున్న ప్రాజెక్టు కె చిత్రంలో ప్రభాస్ తో పాటు కమల్ హాసన్ మరియు బాలీవుడ్ డైనమిక్ యాక్టర్ అమితాబ్ కీలకపాత్రను పోషిస్తున్నారు.దీపికా ప‌డుకోణ్ ఇందులో హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇది ఆమెకు టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్న మొదటి చిత్రం అవుతుంది.

అది నా తన టెక్నాలజీ ఉపయోగించి భారీ విజువల్స్ తో రూపొందిస్తున్న సినిమా అని పబ్లిసిటీ ఇవ్వడంతో ఈ చిత్రంపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇప్పటివరకు మూవీకి సంబంధించి 60 శాతం పైగా షూటింగ్ కూడా పూర్తి అయింది. ఈ మూవీ యొక్క హైప్ మరింత పెంచడం కోసం ఈనెల 20 ప్రారంభం కానున్న కామిక్‌ కాన్‌ – 2023 వేడుకల్లో ఈ మూవీ యొక్క పేరు మరియు ట్రైలర్ ఆవిష్కరించనున్నట్లు చిత్ర యూనిట్ ఇంతకముందే తెలపడం జరిగింది. మూవీకి సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్ ని కూడా జులై 20న యూఎస్ ఏ లో, 21న భారత్ లో రిలీజ్ చేయబోతున్నారు.

- Advertisement -

అయితే వాట్ ఇస్ ప్రాజెక్ట్ కె అనే టైటిల్ తో వచ్చినయి ఫస్ట్ పిక్ లో ప్రభాస్ మార్వెల్ సిరీస్ అనుకరణ తలపిస్తున్నాడు. ఈ మూవీ చూస్తే ఎవరికైనా ఇది అవెంజర్స్ ఇండియన్ వర్షన్ ఏమో అనిపిస్తుంది. ప్రభాస్ లుక్ ఇందులో బాగుంది అందులో డౌట్ లేదు కానీ ఇది మరో ఆది పురుష్ రేంజ్ గ్రాఫిక్స్ అయితే చూడడం కష్టమని అభిమానులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ ఫోటోకి ఐరన్ మాన్ అవెంజర్స్ పిక్ జత చేసి దీని డూప్లా ఉంది అని కామెంట్స్ కూడా చేస్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here