Guntur Karaam : తీవ్రంగా నిరాశపర్చిన ‘గుంటూరు కారం’ మొదటి సాంగ్.. ‘ధమ్ బిర్యానీ’ లో ‘ధమ్’ లేదంటున్న ఫ్యాన్స్!

- Advertisement -

Guntur Karaam : సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో ‘గుంటూరు కారం’ అనే చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సోషల్ మీడియా ఒక రేంజ్ లో ఊగిపోతూ ఉంటుంది. అతడు మరియు ఖలేజా వంటి క్లాసిక్ చిత్రాల తర్వాత మళ్ళీ త్రివిక్రమ్ తో చేస్తున్న సినిమా కాబట్టే ఈ ప్రాజెక్ట్ పై ఈ రేంజ్ అంచనాలు ఏర్పడ్డాయి.

Guntur Karaam
Guntur Karaam

ఇది ఇలా ఉండగా అభిమానులు చాలా కాలం నుండి మొదటి లిరికల్ వీడియో సాంగ్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. దసరా కి విడుదల కావాల్సింది కానీ, కొన్ని అనుకోని కారణాల వల్ల వాయిదా వెయ్యాల్సి వచ్చింది. ఈరోజు త్రివిక్రమ్ పుట్టిన రోజు కావడం తో కాసేపటి క్రితమే ఈ పాటని విడుదల చేసారు. భారీ హైప్ తో విడుదలైన ఈ పాట కి ఫాన్స్ మరియు ఆడియన్స్ నుండి డివైడ్ రెస్పాన్స్ వచ్చింది.

Mahesh Babu

కొద్దిరోజుల క్రితమే ఒక 30 సెకండ్స్ నిడివి ఉన్న బిట్ సోషల్ మీడియా లో లీక్ అయ్యింది. పర్వాలేదు , బాగానే ఉంది అనే రెస్పాన్స్ ని దక్కించుకుంది. ఇక ఈరోజు విడుదలైన పూర్తి పాట విన్న తర్వాత మొన్న లీక్ అయిన 30 సెకండ్స్ మాత్రమే బాగుంది , మిగతా సాంగ్ మొత్తం చాలా యావరేజ్ గా ఉంది అని అంటున్నారు. ముఖ్యంగా మొదటి నిమిషం వ్యవధి ఉన్న ట్యూన్ మాత్రం బాగాలేదని, ఆ తర్వాత నుండి పర్వాలేదు అని అంటున్నారు.

- Advertisement -

కానీ లిరికల్ వీడియో సాంగ్ లో ‘గుంటూరు కారం’ చిత్రం లోని కొన్ని షాట్స్ లో మహేష్ బాబు లుక్స్ , స్టైల్ మరియు స్వాగ్ అదిరిపోయాయి. కేవలం మహేష్ బాబు వల్ల పాట యావరేజ్ అనిపించింది కానీ, థమన్ ఇచ్చిన ట్యూన్ అసలు బాలేదు అంటూ అభిమానులు సోషల్ మీడియా లో థమన్ ని ట్యాగ్ చేసి తిడుతున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here