Venkatesh – Mahesh Babu : వెంకటేష్ తో కలిసి పేకాట ఆడుతూ జల్సా చేస్తున్న మహేష్ బాబు.. వైరల్ అవుతున్న ఫోటోలు!

- Advertisement -

Venkatesh – Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ‘గుంటూరు కారం’ అనే చిత్రం చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఎట్టిపరిస్థితిలో ఈ సినిమాని సంక్రాంతి కానుకగా జనవరి 12 న విడుదల చెయ్యాలనే కసితో పని చేస్తున్నాడు మహేష్. డిసెంబర్ రెండవ వారం లో షూటింగ్ కార్యక్రమాలు మొత్తం పూర్తి అవ్వడమే టార్గెట్ అట.

Venkatesh - Mahesh Babu
Venkatesh – Mahesh Babu

అలా నాన్ స్టాప్ షెడ్యూల్స్ తో క్షణం తీరిక లేకుండా గడుపుతున్న మహేష్ బాబు నిన్న విక్టరీ వెంకటేష్ తో కలిసి పేకాట ఆడుతూ కనిపించడం ఫ్యాన్స్ ని షాక్ కి గురి చేసింది. ఇదేంటి మహేష్ బాబు ఇలాంటి పనులు కూడా చేస్తాడా?, అది కూడా విక్టరీ వెంకటేష్ తో కలిసి, అసలు ఏమి జరుగుతుంది అంటూ నిన్న సోషల్ మీడియా లో మహేష్ – వెంకటేష్ పేకాట ఆడుతున్న ఫోటోలను అప్లోడ్ చేసారు ఫ్యాన్స్.

ఇది నిజమా, లేకపోతే గుంటూరు కారం లో ఏదైనా సన్నివేశం కోసం ఇలా చేసారా..?, వెంకటేష్ ఈ చిత్రం లో స్పెషల్ రోల్ లో కనిపించబోతున్నాడా?, ఇలాంటి సందేహాలు ఫ్యాన్స్ లో మొదలయ్యాయి. అసలు విషయం ఏమిటి అని ఆరాలు తియ్యగా ‘మీల్ కంపెనీ’ అధినేత కృష్ణ రెడ్డి నిన్న హైదరాబాద్ లో ఒక క్లబ్ హౌస్ ని ప్రారంభించాడు. ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు విక్టరీ వెంకటేష్ పాల్గొన్నారు.

- Advertisement -
Mahesh Babu

ప్రారంభోత్సవం లో భాగంగా కాసేపు సరదాగా పేకాట ఆడారు. దానికి సంబంధించిన ఫొటోలే ఇవి అంటూ మహేష్ బాబు పీఆర్ టీం క్లారిటీ ఇచ్చింది. దీంతో అప్పటి వరకు ఏర్పడిన గందరగోళం కి మొత్తం చెక్ పడింది. కానీ మహేష్ ని ఇంత మాస్ యాంగిల్ లో చూసిన కొంత మంది అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. ఇలాంటివి సినిమాల్లో కూడా చెయ్యొచ్చు కదా అంటూ మహేష్ ని ట్యాగ్ చేసి అడుగుతున్నారు ఫ్యాన్స్ .

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here