Trivikram Srinivas : ‘బ్రో’ చిత్రానికి త్రివిక్రమ్ రెమ్యున‌రేష‌న్ ఎంతో తెలుసా.. హీరోలకు కూడా అంతలేదుగా సామీ

- Advertisement -

Trivikram Srinivas : ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్, సుప్రీం హీరో సాయిధ‌ర‌మ్ తేజ్ కాంబోలో వస్తున్న మెగా మల్టీ స్టారర్ మూవీ ‘బ్రో’. దర్శక నటుడు సముద్రఖని ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. ఇక ఈ సినిమాలో ప్రియా ప్రకాష్ వారియర్, హాట్ బ్యూటీ కేతికాశర్మ హీరోయిన్లుగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ తమిళంలో సూపర్ హిట్ గా నిలిచిన వినోదయ సీతం కు రీమేక్.

Trivikram Srinivas
Trivikram Srinivas

ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల.. జీ స్టూడియోస్‌తో కలిసి నిర్మిస్తున్నారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా జూలై 28న విడుదల కానుంది.ఈ సినిమాపై చిత్ర యూనిట్ రిలీజ్ చేస్తున్న బ్యాక్ టు బ్యాక్ అప్ డేట్స్ చిత్రంపై అంచనాలను భారీగా పెంచేస్తున్నాయి. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన హాట్ న్యూస్ వైరల్ అవుతోంది. అగ్ర దర్శకుడిగా పేరొందిన త్రివిక్రమ్ రెమ్యునరేషన్ గురించి వార్త హల్ చల్ చేస్తోంది. ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన సముద్రఖని ఈ రీమేక్‌కు దర్శకత్వం వహించే అవకాశం వచ్చినా దీంట్లో మాత్రం త్రివిక్రమ్ హ్యాండే మెయిన్ అని వార్తలు వస్తున్నాయి.

Bro Movie

స్క్రీన్ ప్లే మాత్రమే కాకుండా మాటలు కూడా ఇస్తూ.. స్క్రిప్ట్‌లో చాలా మార్పులు చేసాడు త్రివిక్రమ్. అందుకే ఈ సినిమా కోసం రూ. 15 కోట్ల రెమ్యూనరేషన్ అంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. త్రివిక్రమ్ ముందు కొందరు హీరోలు కూడా సరిపోరని నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు మహేష్ బాబుతో త్రివిక్రమ్ ప్రస్తుతం ‘గుంటూరు కారం’ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుని సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here