Trivikram Srinivas : ఇన్నాళ్లు ఫేమస్ రైటర్ పై ఆధారపడ్డ త్రివిక్రమ్.. వీటిలో నీ క్రియేటివిటీ ఏం లేదా గురూజీ

- Advertisement -


Trivikram Srinivas : టాలీవుడ్ లో త్రివిక్రమ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆయన మొదట రైటర్ గా నువ్వు నాకు నచ్చావు, చిరునవ్వుతో, మన్మథుడు, మల్లీశ్వరి లాంటి చిత్రాలకు సూపర్ హిట్ కథలను అందించారు. తర్వాత డైరెక్టర్ గా మారి నువ్వే నువ్వే, అతడు, జల్సా, ఖ‌లేజా, అఆ లాంటి సినిమాలను తెర‌కెక్కించి సూపర్ హిట్స్ అందుకున్నాడు. ఇక ఈ సినిమాలన్నింటికీ కథలను కూడా తానే రాసుకున్నాడు. ఇక త్రివిక్రమ్ రాసే ప్రతి కథలోను డైలాగులు అద్భుతంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ఆ డైలాగులను గుర్తుపెట్టుకుని నిజ జీవితంలో కూడా వాటిని వాడే ఆడియెన్స్ ఎంతో మంది ఉన్నారు. డైరెక్టర్ కు హీరో రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

ఆ డైలాగులకు భారీ సంఖ్యలో అభిమానులున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా త్రివిక్రమ్ చేస్తున్న సినిమాల కారణంగా ఆయనకు ఉన్న గొప్ప పేరు మెల్లమెల్లగా కనుమరుగవుతున్నట్లు కనిపిస్తోంది. గుంటూరు కారం సినిమాతో త్రివిక్రమ్ గ్రాఫ్ మరింతగా పడిపోయిందంటున్నారు. అజ్ఞాతవాసి, అరవింద సమేత వీర రాఘవ సినిమాలతో తడబడిన గురూజీ మళ్లీ గుంటూరు కారం తో కూడా అదే రిజల్ట్ అందుకున్నారు.

Trivikram Srinivas
Trivikram Srinivas

మహేష్ నటించిన గుంటూరు కారం ఫ్లాప్ అవడంతో అభిమానులు త్రివిక్రమ్ పై మండిపడుతున్నారు. ఇక త్రివిక్రమ్ పని అయిపోయిందని.. ఆయనకు మంచి కథలు రాయడం రాదంటూ నెట్టింట్లో విమర్శలు కోకోల్లలుగా వస్తున్నాయి. ఇక త్రివిక్రమ్ మొత్తం తెలుగు రచయిత య‌ద్దన‌పూడి సులోచన రాణి రాసిన నవలల నుంచి కాపీ కొడతారని విమర్శిస్తున్నారు. ఆమె రాసిన న‌వ‌ల‌లోని కథలనే కాస్త అటు ఇటు మార్చి వాటిని సినిమాలుగా తెరకెక్కించి జనాలపై వదులుతున్నారన్న కామెంట్స్ వస్తున్నాయి.

- Advertisement -

కానీ ఇప్పుడు ఆమె చనిపోవడం.. ఆమె నుంచి ఎలాంటి నవలలు రాకపోవడంతో త్రివిక్రమ్ సొంతంగా స్టోరీలు రాసుకోలేకపోతున్నాడని నెటిజన్స్ అంటున్నారు. దీంతో త్రివిక్రమ్ కు పెద్ద చెక్కు వచ్చి పడిందంటూ.. ఆయనకు కథలు రాయడమే రాదంటూ విమర్శిస్తున్నారు. ఇందులో ఎంత నిజం ఉందో తెలియాలంటూ ఆమె నవలలను ఫాలో అవుతూ.. త్రివిక్రమ్ సినిమాలు చూసేవారికి అర్థం అవుతుందట. ఇక త్రివిక్రమ్, అల్లు అర్జున్‌తో మరో సినిమా చేయడానికి రెడీ అయ్యాడు. ఈ కథతో అయినా గురూజీ హిట్ కొట్టేస్తాడో లేదో చూడాలి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here