సౌత్ ఇండియా లో టాప్ మోస్ట్ హీరోయిన్స్ లో ఒకరు త్రిష కృష్ణన్. సుమారుగా రెండు దశాబ్దాల నుండి ఈమె స్టార్ హీరోయిన్ గా ఇండస్ట్రీ లో కొనసాగుతూనే ఉంది. ఈ రెండు దశాబ్దాలలో ఎంతోమంది హీరోయిన్లు ఇండస్ట్రీ కి వచ్చారు, వెళ్లిపోయారు కూడా. కానీ నాలుగు పదుల వయస్సు వచ్చినా కూడా ఇప్పటికీ ఈమె సూపర్ హిట్స్ కొడుతూ నెంబర్ గేమ్ లో ముందుకు దూసుకొచ్చింది.
రీసెంట్ గా ఈమె హీరోయిన్ గా నటించిన ‘పొన్నియన్ సెల్వన్’ రెండు బాగాలు విడుదలై బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. ఇప్పుడు లేటెస్ట్ గా ఆమె తమిళ హీరో విజయ్ మరియు లోకేష్ కనకరాజ్ కాంబినేషన్ లో వస్తున్న ‘లియో’ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తుంది.
ఇంత స్టార్ స్టేటస్ అనుభవిస్తున్న త్రిష ఇప్పటి వరకు పెళ్లి చేసుకోకపోవడం విశేషం. ప్రముఖ తమిళ హీరోలు సింబు, ధనుష్ వంటి వారితో డేటింగ్ చేసిన త్రిష ఆ తర్వాత పలు కారణాల చేత ఆమె బ్రేకప్ చేసుకుంది. ఇక ఆ తర్వాత కొన్నాళ్ళకు ఒక ప్రముఖ వ్యాపారవేత్త తో నిశ్చితార్థం చేసుకున్న త్రిష, కొన్ని విబేధాల కారణంగా పెళ్లి క్యాన్సిల్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఇక ఆ తర్వాత త్రిష పెళ్లి ఊసే ఎత్తలేదు. కెరీర్ మీదనే ఎక్కువ ద్రుష్టి పెట్టింది. అయితే త్రిష పెళ్లి చేసుకోకపోవడానికి కారణం మరొకటి ఉందట. ఆమె జాతకం రీత్యా ఆమెకి సంతాన యోగం లేదట. ఈ కారణం చేతనే ఆమె పెళ్లి కూడా క్యాన్సిల్ అయ్యిందట. ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.