Balakrishna : చిరంజీవి ని మించిన బాలయ్య రెమ్యూనరేషన్.. బాబీ చిత్రానికి ఎంత డిమాండ్ చేస్తున్నాడో చూస్తే నోరెళ్లబెడుతారు!

- Advertisement -

Balakrishna : ‘అఖండ’ చిత్రానికి ముందు బాలయ్య బాబు కెరీర్ ఎలా ఉండేదో మనమంతా చూసాము. ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు చిత్రాలతో ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్స్ ని అందుకున్నాడు. ఆ తర్వాత చేసిన ‘రూలర్’ అనే చిత్రం కూడా డిజాస్టర్ ఫ్లాప్ అయ్యింది. ఇక బాలయ్య కెరీర్ అయిపోయింది, నిన్న గాక మొన్న ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన హీరోలు కూడా సూపర్ హిట్స్ ని అందుకుంటున్నాడు బాలయ్య బాబు తప్ప అని టాక్ ఉండేది.

Balakrishna
Balakrishna

కానీ అఖండ చిత్రం బాలయ్య జీవితాన్నే మార్చేసింది. ఈ సినిమా తర్వాత ఈ ఏడాది ప్రారంభం లో విడుదలైన ‘వీర సింహా రెడ్డి’ మరియు లేటెస్ట్ గా విడుదలైన ‘భగవంత్ కేసరి’ చిత్రాలు భారీ హిట్స్ గా నిలిచాయి. ఈ సినిమాల తర్వాత బాలయ్య రేంజ్ బాగా పెరిగిపోయింది. జనాల్లో బాలయ్య సినిమా అంటే మినిమం గ్యారంటీ ఉంటుంది అనే అభిప్రాయం వచ్చేసింది.

Balakrishna akdanda

అందుకే ఆయన తన తదుపరి చిత్రానికి రెమ్యూనరేషన్ భారీ గా పెంచేసాడు. ఈ ఏడాది ‘వాల్తేరు వీరయ్య’ చిత్రం తో ఇండస్ట్రీ ని షేక్ చేసిన డైరెక్టర్ బాబీ తో బాలయ్య బాబు సినిమా చెయ్యబోతున్నాడు. బాలయ్య కెరీర్ లో 109 వ చిత్రం గా తెరకెక్కబోతున్న ఈ సినిమాకి బాలయ్య దాదాపుగా 18 కోట్ల రూపాయిలు అందుకుంటున్నాడు అట. వీటితో పాటుగా డిజిటల్ + సాటిలైట్ రైట్స్ తో పాటుగా, ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ లో కూడా లాభాల్లో వాటా అడుగుతున్నది.

- Advertisement -
Balakrishna  photos

బాలయ్య సినిమా ఇప్పుడు నిర్మాతకి టేబుల్ ప్రాఫిట్స్ వస్తుంది కాబట్టి, ఈ వాటాలన్నీ కలిపితే మరో 20 కోట్ల రూపాయలకు పైగానే ఉంటుందట. ఇది మెగాస్టార్ చిరంజీవి గత చిత్రం ‘భోళా శంకర్’ కి తీసుకున్న రెమ్యూనరేషన్ కంటే ఎక్కువ అని చెప్తున్నారు. ‘భోళా శంకర్’ చిత్రానికి చిరంజీవి దాదాపుగా 35 కోట్ల రూపాయిలు తీసుకున్నాడు. బాలయ్య బాబీ చిత్రానికి 38 కోట్లు తీసుకుంటున్నాడు. ఇదే ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారిన అంశం.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here