trend in movies టాలీవుడ్ లో మన స్టార్ హీరోలు కొన్ని సెంటిమెంట్స్ ని చాలా బలంగా నమ్ముతారు,వాటిల్లో గన్ సెంటిమెంట్ కూడా ఒకటి.రీసెంట్ గా సరైన హిట్స్ లేకుండా ఇబ్బంది పడుతున్న స్టార్ హీరోలందరిని మైండ్ పోగొట్టే రేంజ్ లో బౌన్స్ బ్యాక్ అయ్యేలా చేసిన దాంట్లో గన్ సెంటిమెంట్ పాత్ర చాలానే ఉంది.రీసెంట్ గా విడుదలైన మెగాస్టార్ చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ సినిమా లో కూడా గన్స్ ఇష్టమొచ్చినట్టు వాడేస్తాడు మెగాస్టార్.ఈ సినిమాకి ముందు రెండు సినిమాలు భారీ ఫ్లాప్స్ అయ్యాయి, ఇక చిరంజీవి మళ్ళీ భారీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడం కోసమే అనుకుంటున్న సమయం లో మరోసారి గన్ పట్టాడు, ఇండస్ట్రీ రికార్డ్స్ ని మడతపెట్టేసాడు.
ఇక పాన్ ఇండియా లెవెల్ లో ఆల్ టైం టాప్ 2 హిట్ గా నిల్చిన #KGF చాప్టర్ 2 విజయం లో కూడా గన్స్ పాత్ర ఎక్కువ ఉన్నది.ఇక రాబొయ్యే సినిమాల్లో కూడా ఈ గన్స్ సెంటిమెంట్ బలంగా ఉండబోతుంది..ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – సుజిత్ కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న #OG మాఫియా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కబోతున్న సినిమా, ఇందులో గన్స్ విచ్చలవిడిగా వాడేసుకోవచ్చు..మరి గన్స్ అంటే పిచ్చెక్కిపోయ్యే పవన్ కళ్యాణ్ ఈ సినిమా తో ఆ సెంటిమెంట్ ని కొనసాగిస్తాడో లేదో చూడాలి.
కేవలం స్టార్ హీరోలు మాత్రమే కాదు, చిన్న హీరోలకు కూడా గన్స్ సెంటిమెంట్ బాగా వర్కౌట్ అవుతుంది.అడవి శేష్ వరుసగా థ్రిల్లర్ జానర్ సినిమాలు చేస్తూ గన్ కి ఎక్కువ పని చెప్తూ తన కెరీర్ ని వేరే లెవెల్ కి తీసుకెళ్లాడు.ఇక లేటెస్ట్ గా నిన్న గాక మొన్న విడుదలైన కిరణ్ అబ్బవరం ‘వినరో భాగ్యము’ విష్ణు కథ సినిమాలో కూడా గన్ వాడకాన్ని మనం ఎక్కువగా గమనించొచ్చు.
మరో విశేషం ఏమిటంటే ఈ గన్ సెంటిమెంట్ ని మొట్టమొదట ప్రారంభించిన హీరో సూపర్ స్టార్ కృష్ణ..ఎన్టీఆర్ మరియు నాగేశ్వరరావు వంటి దిగ్గజాలు ఇండస్ట్రీ కి రెండు కళ్లులాగా కొనసాగుతున్న రోజుల్లో సూపర్ స్టార్ కృష్ణ ఇండస్ట్రీ లోకి వచ్చాడు.జానపదాలు, పౌరాణికాలు మరియు కుటుంబ కథా చిత్రాలకు బాగా అలవాటు పడిన ప్రేక్షకులకు థ్రిల్లర్ జానర్ సినిమాలను పరిచయం చేసి సరికొత్త ట్రెండ్ ని సృష్టించాడు.ఈ జానర్ సినిమాలలో ఎక్కువగా గన్ కి పని చెప్పాల్సి ఉంటుంది కాబట్టి గన్ అనేది బాగా ఫేమస్ అయ్యింది సూపర్ స్టార్ కృష్ణ వల్లే, ఆ తర్వాత ‘మోసగాళ్లకు మోసగాడు’ వంటి కౌ బాయ్ నేపథ్యం లో వచ్చిన సినిమాలో కృష్ణ గన్ వాడిన విధానం కి పాన్ ఇండియా మొత్తం ఊగిపోయింది.
ఎప్పుడైతే కృష్ణ గన్స్ ని వాడడం మొదలెట్టాడో మిగిలిన స్టార్ హీరోలు కూడా ఆ జానర్ లో సినిమాలు చేసి గన్స్ వాడకం కి పనిచెప్పి హిట్స్ , బ్లాక్ బస్టర్స్ మరియు ఇండస్ట్రీ హిట్స్ ని అందుకున్నారు.కృష్ణ తరం తర్వాత గన్ పట్టి ఇండస్ట్రీ ని షేక్ చేసిన హీరో మెగాస్టార్ చిరంజీవి.ఆయన సినీ కెరీర్ ని మలుపు తిప్పిన ఖైదీ చిత్రం లో రకరకాల గన్స్ ని వాడి ప్రేక్షకులకు గూస్ బంప్స్ రప్పించాడు.ఆరోజుల్లో ‘ఖైదీ’ పోస్టర్స్ లో గన్ ని ధరించి రాంబో స్టైల్ లుక్ తో నిల్చున్న మెగాస్టార్ లుక్స్ హైలైట్ గా మారాయి.ఆ తర్వాత ఆయనకీ ప్రతీ సినిమాలోనూ ఎదో ఒక సందర్భం లో గన్ వాడడం అలవాటుగా మారిపోయింది.ఆ సినిమాలలో ఎక్కువ శాతం విజయం సాధించినవే ఉండడం విశేషం.
ఇక నేటి తరం హీరోలలో గన్స్ వాడకం అంటే మన అందరికి గుర్తుకొచ్చే మొట్టమొదటి పేరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్..ఈయన చేతిలో గన్ ఉంటే అర్జునుడి చేతిలో బాణం ఉన్నట్టే లెక్క.బద్రి సినిమా నుండి ఆయన గన్ వాడకం మొదలెట్టాడు.ఈ చిత్రం లో ఒక పాట లో కౌ బాయ్ గెటప్ లో కనిపిస్తూ గన్ తో ఆయన చేసిన విన్యాసాలకు అభిమానులు మెంటలెక్కిపొయ్యారు.ఇక ఆ తర్వాత ఖుషి చిత్రం లో కూడా పవన్ కళ్యాణ్ గన్ వాడాడు, ఈ సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే.
ముఖ్యంగా ఆయన గన్ ని తిప్పే తీరుకి ఫ్యాన్స్ కానీ వాళ్ళంటూ ఉండరు.ఇక పవన్ కళ్యాణ్ తర్వాత గన్స్ అంటే మనకి గుర్తుకు వచ్చే పేరు సూపర్ స్టార్ మహేష్ బాబు.ఈయన తన నాల్గవ సినిమా టక్కరి దొంగ సమయం నుండే గన్స్ తో ఆదుకోవడం మొదలెట్టాడు.కానీ ఆ సినిమా పెద్దగా ఆడకపోయినా , మహేష్ ఆ తర్వాత గన్ పట్టిన అతడు, పోకిరి , బిజినెస్ మ్యాన్, దూకుడు వంటి చిత్రాలు ఆయన కెరీర్ నే మార్చేశాయి.ముఖ్యంగా పోకిరి సినిమాలో ఆయన గన్ వాడిన స్టైల్ అప్పట్లో ఒక సెన్సేషన్ అయ్యింది.అలా ఈ హీరోల వల్ల గన్ సెంటిమెంట్ టాలీవుడ్ లో బాగా ఫేమస్ అయ్యింది.