Tollywood Flop Movies : కోటి రూపాయిలకంటే తక్కువ వసూళ్లు సాధించిన అట్టర్ ఫ్లాప్ సినిమాలు ఇవే

- Advertisement -

Tollywood Flop Movies : మన తెలుగు సినిమాలు ఒకప్పుడు ఎలా ఉన్న కనీస స్థాయి వసూళ్లను రాబట్టేవి.అట్టర్ ఫ్లాప్ సినిమాలు కూడా 50 రోజులు మరియు వందరోజులు ఆడిన సందర్భాలు ఉన్నాయి, అలాంటి రోజుల నుండి నేడు టాక్ తేడా అయితే కనీసం కోటి రూపాయిల షేర్ ని కూడా వసూలు చెయ్యలేని సినిమాలను చూసే స్థాయికి పడిపొయ్యాం.దానికి కారణం ఓటీటీ అనే చెప్పాలి.ఈమధ్య విడుదల అవుతున్న కొత్త సినిమాలు నెల పూర్తి అవ్వగానే ఓటీటీ లో విడుదలవుతున్నాయి.అందువల్ల ఫ్లాప్ టాక్ ని తెచ్చుకున్న సినిమాలను చూడడానికి జనాలు ఏమాత్రం కూడా ఆసక్తి చూపించడం లేదు.ఫలితంగా క్లోసింగ్ కలెక్షన్స్ కనీసం కోటి రూపాయిల షేర్ ని కూడా దక్కించుకోలేకపోతున్నాయి.ఆ సినిమాలేంటో ఇప్పుడు మనం ఈ ఆర్టికల్ లో చూడబోతున్నాము.

1)ఆఫీసర్ :

Tollywood Flop Movies
Tollywood Flop Movies

అక్కినేని నాగార్జున కెరీర్ లో మాయని మచ్చ లాంటిది ఈ సినిమా.ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ఈ చిత్రం తోనే నాగార్జున తన స్టార్ స్టేటస్ ని పోగొట్టుకోవాలి వచ్చింది.శివ వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ తో నాగార్జున కి స్టార్ స్టేటస్ ఇచ్చిన రామ్ గోపాల్ వర్మ, అదే స్టార్ స్టేటస్ ని ఆఫీసర్ సినిమాతో తీసేసాడు.భారీ హైప్ తో విడుదలైన ఈ సినిమాకి ఫుల్ రన్ లో కేవలం 63 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు మాత్రమే వచ్చాయి.నాగార్జున లాంటి స్టార్ కి ఇలాంటి వసూళ్లు రావడం దురదృష్టకరం.

- Advertisement -

2)సన్ ఆఫ్ ఇండియా :

Son Of India

సుమారుగా నాలుగు దశాబ్దాల నుండి ఇండస్ట్రీ లో హీరో గా విలన్ గా మరియు క్యారక్టర్ ఆర్టిస్టు గా మోహన్ బాబు ఒక రేంజ్ పీక్ కెరీర్ ని చూసాడనే చెప్పాలి.హీరోగా ఆయనకి గతం లో ఇండస్ట్రీ హిట్స్ కూడా ఉన్నాయి.అలాంటి మోహన్ బాబు చాలా కాలం తర్వాత హీరో గా నటిస్తూ మన ముందుకొచ్చిన ‘సన్ ఆఫ్ ఇండియా’ చిత్రానికి కేవలం 6 లక్షల రూపాయిలు మాత్రమే వచ్చాయి.మోహన్ బాబు లాంటి స్టేటస్ ఉన్న ఒక వ్యక్తికీ ఇలాంటి వసూళ్లు రావడం అంటే చాలా అవమానకరం అనే చెప్పాలి.

3) జిన్నా :

GInna Movie

తండ్రి బాటలోనే తనయుడు మంచి విష్ణు కూడా ‘జిన్నా’ సినిమాతో కోటి రూపాయిలకంటే తక్కువగా 63 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.తనని చూసి జనాలెవ్వరు రారని అర్థం చేసుకున్న మంచు విష్ణు ,ఈ సినిమాలో క్రౌడ్ ని థియేటర్స్ కి పుల్ చేసేందుకు సన్నీ లియోన్ మరియు పాయల్ రాజ్ పుత్ వంటి క్రేజీ స్టార్ హీరోయిన్స్ ని పెట్టుకున్నాడు కానీ ఫలితం మాత్రం సూన్యం.సన్నీ లియోన్ మరియు పాయల్ రాజ్పుత్ క్రేజ్ ని మంచు బ్రాండ్ ఇమేజి డామినేట్ చేసిందని.అందుకే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది.

4)స్వాతి ముత్యం :

Swathi muthyam Movie

ప్రముఖ నిర్మాత బెల్లంకొండ గణేష్ రెండవ కొడుకు బెల్లంకొండ గణేష్ ని ఇండస్ట్రీ కి పరిచయం చేస్తూ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద నాగ వంశీ నిర్మించిన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చింది.కానీ మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమాకి పోటీ గా దింపడం తో ఓపెనింగ్స్ నుండే భారీగా డౌన్ అయ్యింది.ఫలితంగా క్లోసింగ్ కలెక్షన్స్ 75 లక్షల రూపాయిల లోపే ముగిసిపోయింది.ఈ సినిమా అప్పుడు కాకుండా వేరే టైం లో విడుదల అయ్యుంటే కచ్చితంగా పెద్ద హిట్ అయ్యేదని ట్రేడ్ పండితులు సైతం చెప్తున్న మాట.

5) హంట్ :

Hunt Movie

మహేష్ బాబు బావ సుధీర్ హీరో గా నటించిన ఈ సినిమా ఎప్పుడు విడుదలైందో ఎప్పుడు థియేటర్స్ నుండి వెళ్లిపోయిందో కూడా ఎవరికీ తెలియదు.కనీస స్థాయి ఓపెనింగ్ అయినా వస్తుందని భావిస్తే ఫుల్ రన్ లో 20 లక్షల రూపాయిల షేర్ ని కూడా రాబట్టలేక పోయింది.చాలా కాలం నుండి సరైన సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న సుధీర్ బాబు ఈ సినిమా తో తనకి అంతకుముందు ఉన్న మార్కెట్ ని పూర్తిగా పోగొట్టుకున్నాడు.

పైన చెప్పిన లిస్ట్ కేవలం పేరున్న హీరోలవి మాత్రమే.. వీళ్ళ సినిమాలు కాకుండా సాయి కుమార్ కొడుకు ఆది నటించిన రీసెంట్ చిత్రాలన్నీ కోటి రూపాయిల లోపే వసూళ్లను రాబట్టాయి. వీళ్ళ తర్వాత కిరణ్ అబ్బవరం హీరో గా నటించిన గత చిత్రం ‘నేను మీకు బాగా కావాల్సినవాడిని’ కూడా కోటి రూపాయిల లోపే వసూళ్లను రాబట్టింది .ఇక ఈ సంక్రాంతి చిరంజీవి మరియు బాలయ్య సినిమాల మధ్య వచ్చిన ‘కళ్యాణం కమనీయం’ అనే చిత్రం కూడా కోటి రూపాయిల లోపే వసూళ్లను రాబట్టింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

   
vps230225.betterwebtechnologies.com telugucinematoday.com