Samantha : బాత్ రూం ఫోటో షేర్ చేసిన సమంత.. మరి ఇంతలా తెగించావేంటి అంటున్న నెటిజన్స్

- Advertisement -


Samantha : స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈ ముద్దుగుమ్మ ‘ఏ మాయ చేశావే’ సినిమాతో 2010లో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే తన అందంతో కుర్రకారు మతులు పోగొట్టి మంచి సక్సెస్ అందుకుంది ఈ అమ్మడు. ప్రస్తుతం టాలీవుడ్‌తో పాటు సౌత్ ఇండస్ట్రీలోనే స్టార్ హీరోయిన్‌గా క్రేజ్ సంపాదించుకుంది. అయితే.. అనూహ్యంగా ఈ మధ్య కాలంలో మయోసైటిస్ వ్యాధి బారిన పడి కొంత కాలం సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. సమంత లాస్ట్ విజయ దేవరకొండతో కలసి ‘ఖుషి’ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీ అనంతరం సినిమాలకు బ్రేక్ ఇచ్చేసింది. అంతక ముందు ఒప్పుకున్న సినిమాల అడ్వాన్స్‌లు కూడా నిర్మాతలకు తిరిగి ఇచ్చేసి తన పూర్తి ఫోకస్ ఆరోగ్యం పైనే పెట్టింది. ఈ క్రమంలోనే సినిమాలకు ఏడాది పాటు గ్యాప్ ఇచ్చి.. పుణ్య క్షేత్రాలను సైతం దర్శించుకోవడంతో పాటు.. ఆరోగ్య పరంగా కూడా ఎన్నో శ్రద్ధలు తీసుకుంది.

Samantha

సమంత సినిమాల విషయంలో ఎంత పాపులరిటీ సాధించిందో అంత కంటే ఎక్కువ పర్సనల్ లైఫ్ విషయంగా వార్తల్లో నిలిచింది. ఇక మయోసైటిస్ నుంచి పూర్తిగా కోలుకున్న సమంత మళ్లీ సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసినట్లు ఇన్‌స్టా వేదికగా తెలిపింది. ఇక సినిమాల విషయం పక్కన పెడితే.. నిత్యం సోషల్ మీడియాలో సమంత యాక్టివ్ గా ఉంటుంది.

తనకు సంబంధించిన పర్సనల్, సినిమా ఇలా ప్రతి విషయాన్ని అభిమానులతో పంచుకోవడమే కాకుండా.. అప్పుడప్పుడూ హాట్ హాట్ ఫొటో షూట్‌లతో కూడా అలరిస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా బాత్ రూమ్‌లో దిగిన ఫోటోలను షేర్ చూస్తూ ‘ఇబ్బంది పడటం లేదు’ అనే క్యాప్షన్ ఇచ్చింది. ఇందులో సమంత.. వైట్‌ షర్ట్, బ్లూ జీన్స్ ధరించి మత్తెక్కించే పోజులిచ్చింది. ప్రస్తుతం ఈ అమ్మడి ఫొటోలు నెట్టింట సందడి చేస్తున్నాయి. ఈ ఫోటోలను చూసిన నెటిజన్స్ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here