Siri Hanumanth : జబర్దస్త్ షోకు సిరి హన్మంతు గుడ్ బై.. ఆమె ప్లేసులో మరో హాట్ బ్యూటీ

- Advertisement -


Siri Hanumanth : బుల్లితెర కామెడీ షో జబర్దస్త్‌ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఆ షో ఎంతో మందికి లైఫ్ అందించింది. అలాంటి షోకు సిరి హనుమంత్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఆమె యాంకరింగ్ ప్రారంభించి కొన్ని నెలలే అయింది. ఇంతలోనే ఆమె జబర్దస్త్‌కి గుడ్‌బై చెబుతోందన్న వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బిగ్ బాస్ సీజన్ 5లో కంటెస్టెంట్ గా తన గ్లామర్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ బ్యూటీ. కెరీర్ మొదట్లో యూట్యూబర్ గా, సీరియల్ ఆర్టిస్ట్ గా ప్రేక్షకులను అలరించింది. బిగ్ బాస్ సీజన్ 5 లో సిరి టాప్ ఫైవ్ కంటెస్టెంట్లలో ఒకరిగా నిలిచింది. ప్రస్తుతం పలు షోలకు యాంకర్‌గా అవకాశాలను అందుకుంటూ బిజీగా ఉంది. ఇటు యాంకరింగ్, అటు పలు సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ చేస్తూ కెరీర్ లో దూసుకుపోతుంది.

బిగ్ బాస్ సీజన్ 5లో షణ్ముఖ్ తో క్లోజ్ గా వ్యవహరించింది. ఆమె కారణంగానే షణ్ముఖ్ తో తన దీప్తి సునయన బ్రేకప్ చెప్పిందని చాలా రూమర్స్ వచ్చాయి. వాళ్ల పరిస్థితి ఎలా ఉన్నా.. సిరి శ్రీహాన్ ల బంధంలో మాత్రం మార్పు రాలేదు. ఇవన్నీ కాకుండా ప్రస్తుతం సిరి కెరీర్‌లో అంచెలంచెలుగా ఎదుగుతూ తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్‌ను క్రియేట్ చేసుకుంటోంది. ప్రస్తుతం పలు షోలకు హోస్టుగా వ్యవహరిస్తోంది. ఇది ఇలాం ఉంటే జబర్దస్త్‌కు ఇటీవల యాంకర్లు వరుసగా మారుతున్నారు. గతంలో అనసూయ యాంకరింగ్ చేసేది. ఆమె స్థానంలో రష్మీ గౌతమ్ వచ్చింది. తర్వాత సౌమ్యరావు కొంత కాలం చేసింది. ఆమె కూడా వెళ్లిపోయి.. ఇప్పుడు సిరి హనుమంత్ ఎంట్రీ ఇచ్చింది.

సిరి హనుమంతు జబర్దస్త్‌కు యాంకర్ గా చేయడం ప్రారంభించి ఎన్ని నెలలో కావడం లేదు. ఇంతలోనే సిరి జబర్దస్త్ కు గుడ్ బై చెప్పేస్తుందంటూ ప్రచారం జరుగుతోంది. తాజాగా రిలీజ్ అయిన జబర్దస్త్ ప్రోమో దీనికి కారణం. ఈ ప్రోమోలో జబర్దస్త్ కమెడియన్ చేసిన వ్యాఖ్యలు ప్రేక్షకులలో పలు అనుమానాలకు దారితీసాయి. ఈ షోలో కమెడియన్ గా వ్యవహరిస్తున్న నూకరాజు సిరి దగ్గరకు వెళ్లి.. సిరి హనుమంతు.. జస్ట్ ఫర్ వన్ మంత్ అనేశాడు. అవి ఎవరో కావాలని చేసిన కామెంట్స్ అని సిరి వివ‌రించింది. అయితే మీరు కంటిన్యూ అవుతున్నారా.. అని నూకరాజు అడగగా అవును నేనే కంటిన్యూ అవుతా అంటూ క్లారిటీ ఇచ్చింది. సరే చూద్దాంలే అని నూకరాజు వెటకారంగా చెప్పడంతో ఆమె షోలో ఉంటుందా.. వెళ్లిపోతుందా అనే అంశంపై అనుమానాలు మరింతగా పెరిగాయి. సిరి హనుమంతు కూడా ఎక్కువ కాలం జబర్దస్త్ యాంకర్ గా ఉండదేమో.. అనసూయ, సౌమ్య రావు లాగా గుడ్ బై చెప్పేసి తన కెరీర్ తాను చూసుకుంటుందంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here