Katrina Kaif దగ్గర 5 కోట్లు అప్పు చేసిన టాలీవుడ్ స్టార్ హీరో..ఇప్పటి వరకు రూపాయి కూడా తిరిగి ఇవ్వలేదట!

- Advertisement -

Katrina Kaif : మన టాలీవుడ్ సినిమాల ద్వారా పరిచయమై, ఆ తర్వాత బాలీవుడ్ కి వెళ్లి వరుసగా సూపర్ హిట్స్ని అందుకొని స్టార్ హీరోయిన్స్ గా ఎదిగిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అలాంటి వారిలో కత్రినా కైఫ్ ఒకరు. ఈమె తెలుగు లో మల్లీశ్వరి అనే చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వడం తో ఈమెకి టాలీవుడ్, కోలీవుడ్ మరియు బాలీవుడ్ నుండి వరుసగా అవకాశాలు క్యూ కట్టాయి.

Katrina Kaif
Katrina Kaif

‘మల్లీశ్వరి’ చిత్రం తర్వాత ఈమె తెలుగు లో బాలయ్య బాబు తో ‘అల్లరి పిడుగు’ అనే చిత్రం చేసింది. ఈ సినిమా తర్వాత మళ్ళీ ఆమె సౌత్ సినిమాల వైపు కన్నెత్తి కూడా చూడలేదు. బాలీవుడ్ లో సూపర్ స్టార్ రేంజ్ ఇమేజి ని ఎంజాయ్ చేస్తూ కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్స్ ని అందుకుంటుంది. ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గా క్రేజీ హీరోయిన్ గురించి సోషల్ మీడియా లో బయటపడిన ఒక వార్త తెగ హల్చల్ చేస్తుంది.

Katrina Kaif Photos

అదేమిటంటే ఈమె సౌత్ లో సినిమాలు తక్కువే చేసినప్పటికీ కొంతమంది స్టార్ హీరోలతో మాత్రం బాగానే క్లోజ్ గా ఉండేదట. ప్రైవేట్ పార్టీలలో కలుస్తూ అలా పరిచయాలు ఏర్పడ్డాయాట. అలా 7 ఏళ్ళ క్రితం టాలీవుడ్ లో ఒక యంగ్ హీరో ఈమెకి పరిచయమయ్యాడట. ఆ పరిచయం కాస్త స్నేహం గా కూడా మారింది. అయితే అప్పట్లో ఈ కుర్ర హీరో ఒక సినిమాని నిర్మించాడు.

- Advertisement -
Katrina Kaif Stills

ఈ చిత్రం లో ఆయనే హీరో గా నటించాడు కూడా. రివ్యూస్ బాగానే వచ్చినప్పటికీ కూడా ఎందుకో కమర్షియల్ గా ఈ సినిమా ఫ్లాప్ అయ్యింది. అయితే ఫైనాన్సర్స్ కి తిరిగి డబ్బులు ఇచ్చేందుకు ఆ సమయం లో ఈయన దగ్గర చిల్లి గవ్వ కూడా లేదట. అప్పుడు ఎవరిని అడగాలో తెలియక కత్రినా కైఫ్ ని 5 కోట్ల రూపాయిలు డబ్బులు అడిగితే ఆమె వెంటనే ఇతనికి ఇచ్చింది. కానీ ఇప్పటి వరకు ఆ హీరో కత్రినా కి తిరిగి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదట.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here