Eega : సినిమాలో విలన్ సుదీప్ రోల్ ని మిస్ చేసుకున్న టాలీవుడ్ స్టార్ హీరో అతనేనా..? చేసుంటే వేరే లెవెల్ ఉండేది!

- Advertisement -

Eega : దర్శక ధీరుడు రాజమౌళి ప్రతిభ గురించి ఎంత మాట్లాడుతుకున్న అది తక్కువే అవుతుంది. కేవలం ఒక సీరియల్ డైరెక్టర్ గా కెరీర్ ని ప్రారంభించిన రాజమౌళి, ఆ తర్వాత స్టూడెంట్ నెంబర్ 1 సినిమాతో సూపర్ హిట్ ని అందుకున్నాడు. అప్పుడు మొదలైన ఆయన విజయయాత్ర #RRR చిత్రం తో పాన్ వరల్డ్ స్థాయికి చేరుకొని మన తెలుగు సినిమా ఇండస్ట్రీ కి ఆస్కార్ ని ముద్దాడే రేంజ్ కి తీసుకెళ్లాడు.

Eega
Eega

ఇక నుండి రాజమౌళి సినిమా అంటే తెలుగు సినిమా మాత్రమే కాదు, పాన్ వరల్డ్ సినిమా. ఆయన చిత్రం కోసం ఇక ప్రపంచం లో ఉన్న సినీ అభిమానులందరూ ఎదురు చూస్తారు. అయితే రాజమౌళి కెరీర్ లో ఎన్ని సూపర్ హిట్ సినిమాలు ఉన్నప్పటికీ, ‘ఈగ’ చిత్రం ఎంతో ప్రత్యేకం. మగధీర మరియు మర్యాదరామన్న చిత్రాల తర్వాత ఆయన చేసిన సృష్టించిన అద్భుతమైన దృశ్య కావ్యం ఇది.

ఒక చిన్న ‘ఈగ’ తో రాజమౌళి ఇండస్ట్రీ ని షేక్ చేసాడు. ఇక ఈ సినిమాలో కన్నడ సూపర్ స్టార్ కిచ్చా సుదీప్, న్యాచురల్ స్టార్ నాని మరియు సమంత ప్రధాన పాత్రలు పోషించారు. ఇందులో సుదీప్ పేరుకే విలన్ కానీ, సినిమా మొత్తం ఆయనే ఉంటాడు. ఒక్కమాటలో చెప్పాలంటే ఈ చిత్రానికి ఆయనే హీరో, ఆయనే విలన్ కూడా. అయితే ఈ పాత్ర ని తొలుత రాజమౌళి సుదీప్ తో కాకుండా మాస్ మహారాజ రవితేజ తో చేయిద్దాం అనుకున్నాడట. అయితే రవితేజ సంగతి అందరికీ తెలిసిందే, ఆయన ఏడాది కనీసం రెండు మూడు షూటింగ్స్ తో ఫుల్ బిజీ గా ఉంటాడు.

- Advertisement -

ఆయన డేట్స్ అడగాలంటే చాలా ముందుగా అడగాల్సి ఉంటుంది, రిజర్వ్ చేసుకోవాల్సి ఉంటుంది. కానీ రాజమౌళి అప్పటికప్పుడు అడిగేలోపు డేట్స్ సర్దుబాటు చెయ్యలేకపోయాడట. దీనితో రాజమౌళి కి ఏమి చెయ్యాలో తోచక ఇద్దరు ముగ్గురు హీరోల పేర్లు అనుకున్నాడు, కానీ ఎందుకో వాళ్ళు ఈ కథకి సెట్ అవ్వడం లేదు. చివరికి కన్నడ సూపర్ స్టార్ కిచ్చా సుదీప్ ని ఈ చిత్రం లో తీసుకున్నాడు. భారీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాక కిచ్చా సుదీప్ కి పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు లభించిన సంగతి అందరికీ తెలిసిందే. ఒకవేళ రవితేజసినిమాని చేసుంటే తెలుగు ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకునే వాళ్ళో తెలియదు కానీ, సుదీప్ కి మాత్రం ఈ పాత్ర చాలా బాగా సూట్ అయ్యినట్టు అనిపించింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here