భోళా శంకర గురించి ఇంట్రెస్టింగ్ ఫాక్ట్స్ చెప్పిన మిల్క్ బ్యూటీ…

- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న హై వోల్టేజ్ చిత్రం ‘భోళా శంకర్‌’ ఆగస్టు 11న విడుదల కాబోతోంది. రిలీజ్ టైం దగ్గర కావడంతో మూవీ టీం ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. ఈ నేపథ్యంలో భళాశంకర్ హీరోయిన్ తమన్నా ప్రమోషన్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొనడం జరిగింది.

ఈ ఇంటర్వ్యూలో ఆమె మూవీ కి సంబంధించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నారు.అంతేకాదు తమన్నా నటిస్తున్న భోళాశంకర్ తో పాటు జైలర్ చిత్రం కూడా ఒక్క రోజు గ్యాప్ తో రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి మరియు సూపర్ స్టార్ రజినీకాంత్ వంటి లెజెండరీ యాక్టర్స్ తో పనిచేయడం ఎంతో ఆనందంగా ఉంది అని తమన్నా పేర్కొంది.

ముఖ్యంగా చిరంజీవి లాంటి యాక్టర్ తో ఫుల్ లెన్త్ రోల్ ప్లే చేయడం తనకు ఈ చిత్రంలో నచ్చిన అంశం అని ఆమె చెప్పింది.ఇంతకుముందు సైరా చిత్రంలో చిరంజీవితో కలిసి వర్క్ చేసినప్పటికీ.. చిరంజీవితో కలిసి డాన్స్ చేసే ఛాన్స్ మాత్రం రాలేదట. అయితే ఈ చిత్రంలో చిరంజీవితో కలిసి స్టెప్పులు వేయడం తనకు ఎంతో నచ్చిందని తమన్నా చెప్పింది. ఈ చిత్రంలో కామెడీ టచ్ కూడా ఉంటుందని మూవీని ఆద్యంతం ఎంజాయ్ చేస్తారని తమన్న పేర్కొన్నారు.

- Advertisement -

సుశాంత్ తో 15 ఏళ్ల తర్వాత తిరిగి నటించడం ఆనందంగా ఉంది అని ఆమె అన్నారు. ఇక ఈ మూవీ తర్వాత తమన్నా తమిళంలో ‘అరణం’ అనే మూవీ, మలయాళం లో బాంద్రా అనే మూవీ చేస్తున్నారు. వీటితో పాటుగా హాట్స్టార్ లో తమన్నా మరో వెబ్ సిరీస్ లో కనిపించనున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here