‘లియో’ చిత్రాన్ని మిస్ చేసుకున్న టాలీవుడ్ స్టార్ హీరో అతనేనా.. మామూలు పొరపాటు కాదిది!తమిళనాడు లో వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ తో ప్రస్తుతం నెంబర్ 1 స్థానం లో ఉన్న హీరో ఎవరు అని అడిగితే ఎవరైనా టక్కుమని చెప్పే పేరు ఇలయథలపతి విజయ్. ఇతను చేస్తున్న సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలుస్తున్నాయి. సినిమాలో పెద్దగా కంటెంట్ లేకపోయినా కూడా కలెక్షన్స్ విషయం లో నిర్మాతకు లాభాలను రప్పించడం విజయ్ స్పెషాలిటీ. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైన ‘వారసుడు’ చిత్రానికి కూడా మొదటి ఆట నుండే డివైడ్ టాక్ వచ్చింది.

లియో
లియో

కానీ ఫుల్ రన్ లో ఆ సినిమా 300 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించింది. ఇది విజయ్ కెరీర్ లోనే ఆల్ టైం హైయెస్ట్. ఇలా రీసెంట్ గా విడుదలైన విజయ్ సినిమాలన్నిటికీ టాక్ సరిగా రాలేదు, కానీ కలెక్షన్స్ మాత్రం అదుర్స్. ఈ రేంజ్ పీక్ ఫామ్ ని ఎంజాయ్ చేస్తున్న విజయ్ రీసెంట్ గా లోకేష్ కనకరాజ్ తో ‘లియో’ అనే చిత్రం చేసాడు.

ఈ సినిమా షూటింగ్ కార్యక్రమాలు మొత్తం పూర్తి చేసుకొని వచ్చే నెల దసరా కానుకగా విడుదలకు సిద్ధం గా ఉంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన పాటలు మరియు టీజర్ కి ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. గతం లో లోకేష్ కనకరాజ్ దర్శకత్వం లో విజయ్ ‘మాస్టర్’ అనే సూపర్ హిట్ చిత్రం చేసాడు. ఈ సినిమా తర్వాత లోకేష్ కమల్ హాసన్ తో ‘విక్రమ్’ చిత్రం తీసి బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి సునామి సృష్టించాడో మన అందరికీ తెలిసిందే.

అలాంటి బ్లాక్ బస్టర్ తర్వాత విజయ్ లాంటి స్టార్ తో చేస్తున్న సినిమా కాబట్టి ఈ చిత్రం పై అంచనాలు ఆకాశాన్ని అంటాయి. అయితే ఈ సినిమాని తొలుత విజయ్ తో కాకుండ మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తో తియ్యాలని అనుకున్నాడట. హైదరాబాద్ కి వచ్చి కథ వినిపించాడు , ఆయనకీ బాగా నచ్చింది కానీ , ఎందుకో తనకి సెట్ అవ్వడమేమో అని చెప్పాడు. లోకేష్ మీకు సరిగ్గా సరిపోతుంది అని ఎంత చెప్పినా మహేష్ ఒప్పుకోలేదు. ఇక చివరికి విజయ్ తో ఈ సినిమాని చెయ్యాల్సి వచ్చింది.