ఒక్క టికెట్ కోసం సొంత ఇంటిని అమ్మేసిన వీరాభిమాని.. పవన్ కళ్యాణ్ భక్తులు అంటే ఇలాగే ఉంటారు!పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి అభిమానులు ఉండరు, కేవలం భక్తులు మాత్రమే ఉంటారు అని అందరూ అంటూ ఉంటారు. కొన్ని సంఘటనలు చూస్తే అది నిజమే అనిపిస్తాది. హిట్టు/ ఫ్లాప్ తో సంబంధం లేకుండా అభిమానులు ఆయనని అభిమానించే తీరుని చూస్తే ఆశ్చర్యం వేస్తాది. ‘గబ్బర్ సింగ్ ‘, ‘అత్తారింటికి దారేది’ సినిమాల సమయం లో ఆయన క్రేజ్ ఎలా ఉండేదో, అందుకు మూడు రేట్ల క్రేజ్ ప్రస్తుతం ఆయన ఎంజాయ్ చేస్తున్నాడు.

 పవన్ కళ్యాణ్
పవన్ కళ్యాణ్

ఇక పోతే పవన్ కళ్యాణ్ మీద విపరీతమైన భక్తి చూపించిన ఒక అభిమాని గురించి ఇప్పుడు మనం ప్రత్యేకంగా మాట్లాడుకోబోతున్నాం. ఇది నిన్న మొన్న జరిగిన సంఘటన కాదు, 2018 వ సంవత్సరం జరిగిన సంఘటన. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో అప్పట్లో ‘అజ్ఞాతవాసి’ అనే చిత్రం వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే.

‘జల్సా’ , ‘అత్తారింటికి దారేది’ వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్స్ తర్వాత మళ్ళీ వీళ్లిద్దరి కాంబినేషన్ లో వచ్చిన మూడవ సినిమా ఇది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యింది. ఫలితం కాసేపు పక్కన పెడితే ఈ సినిమా విడుదలకు ముందు ఉన్నటువంటి క్రేజ్, బాహుబలి సిరీస్ తో సమానం అని చెప్పడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు.

టికెట్స్ కోసం యుద్ధాలే జరిగాయి. కొన్ని చోట్ల వేలం పాట పాడి టికెట్స్ దక్కించుకున్న అభిమానులు కూడా ఉన్నారు. అలా అనంతపురం కి చెందిన ఒక పవన్ కళ్యాణ్ వీరాభిమాని, వేలంపాట ద్వారా ‘అజ్ఞాతవాసి’ మూవీ బెన్ఫిట్ షో టికెట్ ని తన సొంత ఇంటిని తాకట్టు పెట్టి 20 లక్షల రూపాయలకు కొనుగోలు చేసాడట. ఈ వార్త అప్పట్లో సంచలనం గా మారింది. చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ సంఘటన ని సోషల్ మీడియా లో తల్చుకోగా, అది మరోసారి వైరల్ గా మారింది.