Bichagadu Movie : చిన్న సినిమాగా విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించిన చిత్రాలు మన టాలీవుడ్ లో ఎన్నో ఉన్నాయి. వాటిల్లో ఒకటి ‘బిచ్చగాడు’.తమిళ హీరో విజయ్ ఆంటోనీ నటించిన ఈ చిత్రం తెలుగు లో డబ్ అయ్యి తమిళ్ లో కంటే పెద్ద విజయం సాధించింది.ముందుగా ‘బిచ్చగాడు’ అనే టైటిల్ వినగానే ఈ పేరు ని చూసి థియేటర్స్ కి ఎవరు వస్తారు అని అప్పట్లో ట్రేడ్ పండితులు అనుకునేవారు.
మొదటి వారం రోజులు ఈ సినిమా థియేటర్స్ ఖాళీగానే ఉండింది.కానీ టాక్ చిన్న వ్యాప్తి చెందుతూ రావడం తో రెండవ వారం నుండి వసూళ్ల సునామి కురిసింది.ఎక్కడ చూసినా హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడిపోయింది.ఈ సినిమా డబ్ అయ్యి, తెలుగు విడుదల అవ్వడానికి రెండు కోట్ల రూపాయిల ఖర్చు అయ్యింది.కానీ ఈ సినిమా అప్పట్లో ఫుల్ రన్ లో కేవలం తెలుగు వెర్షన్ నుండి 15 కోట్ల రూపాయిల షేర్ ని రాబట్టింది.
అయితే ఈ సినిమా తెలుగు లో డబ్ అవ్వడానికి ముందు చాలా పెద్ద స్టోరీ నడిచింది.విజయ్ ఆంటోనీ కేవలం హీరో మాత్రమే కాదు, మ్యూజిక్ డైరెక్టర్ కూడా.తెలుగు లో ఆయన శ్రీకాంత్ హీరో గా నటించిన ‘మహాత్మా’ అనే చిత్రానికి సంగీతం అందించాడు.ఈ చిత్రం సమయం లోనే శ్రీకాంత్ విజయ్ ఆంటోనీ కి బాగా క్లోజ్ అయ్యాడు.అప్పట్లో విజయ్ ఆంటోనీ ‘పిచైకరణ్’ అనే సినిమా చేసాడు.తమిళం లో పెద్ద హిట్ అయ్యింది, విజయ్ ఆంటోనీ శ్రీకాంత్ కి మంచి స్నేహితుడు కాబట్టి ఆయనతో కలిసే ఈ చిత్రాన్ని చూసాడు.
చూసిన వెంటనే అద్భుతంగా ఉంది అంటూ మెచ్చుకున్నాడు.అయితే ఆ చిత్ర నిర్మాత చదలవాడ తిరుపతిరావు శ్రీకాంత్ ని తెలుగు లో ఈ సినిమా నువ్వు రీమేక్ చేస్తావా అని అడిగినప్పుడు చేస్తాను అని చెప్పాడట. ఇక ఆ తర్వాత శీకాంత్ రెమ్యూనరేషన్ మరియు సినిమాకి అయ్యే బడ్జెట్ నిర్మాత అనుకున్న దానికంటే ఎక్కువ ఉండడం తో ఈ సినిమాని ఆయన నేరుగా తెలుగు లో దబ్ చేసి విడుదల చేసాడట. ఫలితం మన అందరికీ తెలిసిందే, కానీ శ్రీకాంత్ ఈ సినిమా చేసి ఉంటే ఈరోజు ఆయన రేంజ్ మరోలా ఉండేది అని విశ్లేషకులు చెప్తున్నమాట.