Niharika Konidela : విడాకుల వార్తను పట్టించుకోని నిహారిక.. ఆమెతో కలిసి గోవాలో ఎంజాయ్ చేస్తూ..

- Advertisement -

మెగా డాటర్ Niharika Konidela పర్సనల్ విషయాలు ఇప్పుడు ఎక్కువగా ట్రెండింగ్‌లోకి వస్తున్నాయి. గత కొన్ని రోజులుగా నిహారిక తన భర్త చైతన్యకు దూరంగా ఉంటోందని, ఈ ఇద్దరి మధ్య విబేధాలు వచ్చాయని, అందుకే విడిపోయారని, వేర్వేరుగా ఉంటున్నారని రూమర్లు వస్తూనే ఉన్నాయి. ఇలా ఎన్ని రకాల రూమర్లు వచ్చినా కూడా నిహారిక మాత్రం స్పందించడం లేదు. తన పనిలో తాను బిజీగా గడిపేస్తోంది. తాజాగా కొత్త ప్రొడక్షన్ హౌస్ ను కూడా స్టార్ట్ చేసింది.. అలాగే కొత్త వెబ్ సిరీస్‌ల పనిలో నిహారిక నిమగ్నమై ఉంది.

Niharika Konidela
Niharika Konidela

ఇక తాజాగా తన ఇంఫ్లూయెన్సర్ నిహారికతో కలిసి గోవాలో ఎంజాయ్ చేస్తూన్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.. ఆ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. నిహారిక, ఇంఫ్లూయెన్సర్ నిహారికల మధ్య మంచి రిలేషన్ ఉన్న సంగతి తెలిసిందే.. వీరిద్దరూ గతంలో కూడా ఎన్నోసార్లు వేకేషన్ లకు వెళ్లారు.. ఆ ఫోటోలు కూడా తన సోషల్ మీడియాలో పంచుకుంది నిహారిక.. భర్తతో విడాకులు అని సోషల్ మీడియాలో కోడై కూస్తున్న కూడా నిహారిక మాత్రం పట్టించుకోకపోవడం గమనార్హం.. తాను రెగ్యులర్‌గా వితిక షెరు తో కలిసి జిమ్‌లో సందడి చేస్తుంది… ఒకప్పుడు అయితే చైతన్య, నిహారికలు కలిసి జిమ్‌కు వెళ్లే వారు..

Niharika Konidela  vithika

ఇప్పుడు అయితే ఆమె వితికతోనే కనిపిస్తోంది. అసలు ఎక్కడా కూడా చైతన్య, నిహారికలు కలిసి కనిపించినట్టుగా ఫోటోలు మాత్రం బయటకు రావడం లేదు. ఒకరినొకరు అన్ ఫాలో చేసుకోవడం వంటివి చూస్తుంటే వీరిద్దరి మధ్య గొడవలు జరిగినట్టు అర్థం అవుతోంది. అటు చిరంజీవి కూతురు శ్రీజల, కళ్యాణ్‌ దేవ్ ల వ్యవహారం కూడా ఎవ్వరికీ అంతు పట్టడం లేదు.

- Advertisement -

ఈ ఇద్దరూ గత రెండేళ్లుగా దూరంగానే ఉంటున్నారని, విడాకులు అయ్యాయని రూమర్లు వస్తూనే ఉన్నాయి. అయితే ఇంత వరకు ఇరు కుటుంబాల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇప్పుడు నిహారిక చైతన్య విషయంలోనూ ఇలాంటి రూమర్లే వస్తున్నాయి. నిహారిక చైతన్య విడాకుల రూమర్లపై మెగా ఫ్యామిలీ స్పందిస్తుందా? లేదా? అన్నది చూడాలి…

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here