Tollywood : సినిమాలో కంటెంట్ ఉండాలి ఉంటే చాలు, భారీ బడ్జెట్ మన్మఱియు భారీ తారాగణం లేకపోయినా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతాలు జరుగుతాయి అని రీసెంట్ గా విడుదలైన కొన్ని సినిమాలు నిరూపించింది.అవసరం లేకపోయినా నిర్మాతల చేత ఇష్టమొచ్చినట్టు డబ్బులు పెట్టించే దర్శకులకు ఈ సినిమాలు ఒక పాఠాలు గా నిలిచాయి. దర్శకుడి ప్రతిభకు అద్దం పట్టిన అలాంటి అద్భుతమైన సినిమాల గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాము.
1.) కాశ్మీర్ ఫైల్స్ :

గుట్టు చప్పుడు లేకుండా విడుదలైన ఈ సినిమా గత ఏడాది బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టించిందో అందరూ చూసారు.యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ భారీ బడ్జెట్ మూవీ రాధే శ్యామ్ కి పోటీ గా దిగిన ఈ సినిమా సుమారుగా నాలుగు వందల కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.అంత గ్రాస్ ని రాబట్టిన ఈ సినిమా బడ్జెట్ ఎంతో తెలుసా..?, కోటి రూపాయిలు లోపే.
2 ) కాంతారా:

KGF సిరీస్ మేకర్స్ తెరకెక్కించిన ఈ చిత్రం గత ఏడాది సృష్టించిన వసూళ్ల సునామీని ఇప్పట్లో ఎవరైనా మర్చిపోగలరా.కన్నడ లో చిన్న సినిమాగా విడుదలైన ఈ చిత్రం కూడా 400 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది.అంతటి వసూళ్లను రాబట్టిన ఈ సినిమా బడ్జెట్ కేవలం మూడు కోట్ల రూపాయిలు మాత్రమే.
3)లవ్ టుడే :

తమిళ నాడులో అతి తక్కువ బడ్జెట్ తో డైరెక్టర్ ప్రదీప్ రంగనాథన్ తీసిన ఈ సినిమా కేవలం తమిళనాడు లో మాత్రమే కాదు, తెలుగు లో కూడా సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అయ్యింది.ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన ప్రదీప్ , హీరో గా కూడా అద్భుతంగా చేసాడు.కేవలం 3 కోట్ల 50 లక్షల రూపాయిల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా 100 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది.
4) గీత గోవిందం :

విజయ్ దేవరకొండ ఇండస్ట్రీ లో అప్పుడప్పుడే ఎదుగుతున్న రోజుల్లో వచ్చిన ఈ సినిమా సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చిన సంగతి అందరికీ తెలిసిందే.ఈ సినిమాని తయారు చెయ్యడానికి అప్పట్లో మూడు నుండి 5 కోట్ల రూపాయిల బడ్జెట్ ఖర్చు అయ్యిందట.కానీ ఫుల్ రన్ లో ఈ సినిమా 130 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.చిన్న సినిమాగా విడుదలైన ఈ చిత్రం స్టార్ హీరో రేంజ్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించింది.
5 )ఉప్పెన :

సాయి ధరమ్ తేజ్ తమ్ముడు పంజా వైష్ణవ్ తేజ్ హీరో గా ఇండస్ట్రీ కి పరిచయం అవుతూ చేసిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే.ఈ సినిమాకి అయినా బడ్జెట్ కేవలం నాలుగు కోట్ల రూపాయిలు మాత్రమే. కానీ వచ్చిన వసూళ్లు మాత్రం 110 కోట్ల రూపాయిల గ్రాస్.
6 ) సీతారామం :

మలయాళం హీరో దుల్కర్ సాల్మన్ తెలుగు లో పరిచయం అవుతూ చేసిన సీతారామం సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద గత ఏడాది వండర్స్ సృష్టించింది. ఒక అద్భుతమైన దృశ్య కావ్యంగా, గ్రేట్ లవ్ స్టోరీ గా ఎన్నో ప్రశంసలను అందుకున్న ఈ చిత్రాన్ని కేవలం రెండు కోట్ల రూపాయిల బడ్జెట్ తో తీశారు. కానీ ఫుల్ రన్ లో ఈ సినిమా దాదాపుగా 100 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించింది.